Stock Market Closing 05 June 2023: 


స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభపడ్డాయి. గ్లోబల్‌ మార్కెట్ల  నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం నుంచీ సూచీలు పైపైకి ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 59 పాయింట్లు పెరిగి 18,593 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 240 పాయింట్లు ఎగిసి 62,787 వద్ద క్లోజయ్యాయి. పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో షేర్లు జోరుగా ట్రేడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 30 పైసలు బలహీనపడి 82.67 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 62,547 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,759 వద్ద మొదలైంది. 62,751 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,943 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 240 పాయింట్ల లాభంతో 62,787 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


శుక్రవారం 18,534 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,612 వద్ద ఓపెనైంది. 18,582 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,640 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 59 పాయింట్లు పెరిగి 18,593 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,103 వద్ద మొదలైంది. 44,074 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,266 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 163 పాయింట్లు ఎగిసి 44,101 వద్ద క్లోజైంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎల్‌టీ, గ్రాసిమ్‌ షేర్లు లాభపడ్డాయి. దివిస్‌ ల్యాబ్‌, టెక్ మహీంద్రా, ఏసియన్‌ పెయింట్స్‌, హీరో మోటో, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర  రూ.60,330గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.26,670 వద్ద ఉంది.


Also Read: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది