search
×

Stock Market Today: మార్కెట్లో న్యూ ఇయర్‌ జోష్‌! సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాల పరుగు!

Stock Market Opening 01 January 2023: భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ఓపెనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 01 January 2023: 

భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ఓపెనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్‌ సెషన్లో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్ల లాభంతో 18,191 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 308 పాయింట్ల లాభంతో 61,148 వద్ద ట్రేడవుతున్నాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 60,840 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,871 వద్ద మొదలైంది. 60,764 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,150 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 308 పాయింట్ల లాభంతో 61,148 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

శుక్రవారం 18,105 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,191 వద్ద ఓపెనైంది. 18,086 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,194 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 86 పాయింట్ల లాభంతో 18,191 వద్ద చలిస్తోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 43,038 వద్ద మొదలైంది. 42,961 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,368 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 325 పాయింట్లు పెరిగి 43,311 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. టాటాస్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఆటో, ఏసియన్‌ పెయింట్స్‌, దివిస్‌ ల్యాబ్‌, టెక్‌ మహీంద్రా, హీరోమోటో కార్ప్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎగిశాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 02 Jan 2023 11:17 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?

Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?

Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స

Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స

Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే

Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే

Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు

Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు