By: ABP Desam | Updated at : 19 Sep 2022 11:44 AM (IST)
Edited By: Arunmali
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market News: ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) చలవ వల్ల ఇటీవలి నెలల్లో మన స్టాక్ మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికన్ & యూరోపియన్ మార్కెట్లు నానాటికీ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా ఇండియన్ ఈక్విటీస్ మాత్రం ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నాయి. అయితే, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 60,000 & ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18,000 వద్ద కీలక మానసిక స్థాయులను (psychological levels) చేరిన తర్వాత, కొన్ని బలమైన ప్రాఫిట్ బుకింగ్స్ కనిపించాయి. దీనివల్ల, ఎలుగుబంట్లు మార్కెట్ వేగాన్ని అడ్డుకుని, కొంత అస్థిరంగా మార్చాయి. ఈ పరిస్థితుల్లో, పెట్టుబడిదారులకు రెండు వైపులా (లాంగ్ & షార్ట్) ట్రేడింగ్ అవకాశాలు ఉన్నాయని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. సమీప కాలంలో (near term) మంచి రాబడి ఇవ్వగలవంటూ ఏడు సాక్స్‌లో బయ్, సెల్ సిఫార్సులు చేశారు.
పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ (Petronet LNG) | సెల్ | టార్గెట్ ప్రైస్: రూ.198 | స్టాప్ లాస్: రూ.217
రికమెండ్ చేసిన ఎక్స్‌పర్ట్: సుభాష్ గంగాధరన్, HDFC సెక్యూరిటీస్
కొన్ని వారాలుగా ఇది లోయర్ టాప్స్ - లోయర్ బాటమ్స్ ఫార్మేషన్‌లో ఉంది. రీసెంట్ సపోర్ట్ రూ.210ని కూడా బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి, డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావచ్చని ఎక్స్‌పర్ట్ అంచనా.
లుపిన్ (Lupin) | సెల్ | టార్గెట్ ప్రైస్: రూ.580 | స్టాప్ లాస్: రూ.664
రికమెండ్ చేసిన ఎక్స్‌పర్ట్: సుభాష్ గంగాధరన్, HDFC సెక్యూరిటీస్
ఈ షేరు కూడా గత కొన్ని వారాలుగా లోయర్ టాప్స్ - లోయర్ బాటమ్స్ ఫార్మేషన్‌లో ఉంది. ఇటీవలి కనిష్ట స్థాయిని ఇప్పుడు రెసిస్టెన్స్‌గా ఫేస్ చేస్తోంది కాబట్టి మరింత దిగువకు పడిపోవచ్చని ఎక్స్‌పర్ట్ లెక్కగట్టారు.
మారుతి సుజుకి (Maruti Suzuki) | బయ్ | టార్గెట్ ప్రైస్: రూ.9,850 | స్టాప్ లాస్: రూ.8,860
రికమెండ్ చేసిన ఎక్స్‌పర్ట్: శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్
మంత్లీ ఛార్ట్ ప్రకారం, హయ్యర్ హైస్ - హయ్యర్ లోస్ ఫార్మేషన్‌లో రైజింగ్ ఛానెల్ ప్యాట్రెన్‌లో ఉంది. డైలీ ఫ్రేమ్స్‌లోనూ బ్రేక్ అవుట్ ఇచ్చింది కాబ్టటి అప్‌ట్రెండ్ కొనసాగుతుందని ఎక్స్‌పర్ట్ అంచనా.
సన్ ఫార్మా (Sun Pharmaceuticals) | బయ్ | టార్గెట్ ప్రైస్: రూ.930 | స్టాప్ లాస్: రూ.835
రికమెండ్ చేసిన ఎక్స్‌పర్ట్: శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్
ఇటీవలి కరెక్షన్ తర్వాత, ఇది డబుల్ బాటమ్‌ను ఫామ్ చేసింది. సపోర్ట్ జోన్‌లో కనిపిస్తున్న భారీ వాల్యూమ్ యాక్టివిటీని బట్టి, ఇది ఇక కిందకు పడే ఛాన్స్ చాలా తక్కువని ఎక్స్‌పర్ట్ భావిస్తున్నారు.
ఇండస్ టవర్స్ (Indus Towers) | బయ్ | టార్గెట్ ప్రైస్: రూ.220 | స్టాప్ లాస్: రూ.196
రికమెండ్ చేసిన ఎక్స్‌పర్ట్: శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్
గరిష్ట స్థాయి నుంచి ఇటీవలి షార్ప్ కరెక్షన్ తర్వాత, వీక్లీ ఛార్ట్ ప్రకారం, రీ బౌన్స్ అవుతోంది. కాబట్టి, ఈ స్థాయిలో దీనిని కొనవచ్చని ఎక్స్‌పర్ట్ సూచించారు.
ఓఎన్‌జీసీ (ONGC) | బయ్ | టార్గెట్ ప్రైస్: రూ.152 | స్టాప్ లాస్: రూ.139
రికమెండ్ చేసిన ఎక్స్‌పర్ట్: సమీత్ చౌహాన్, ఏంజెల్ వన్
సన్ ఫార్మా (Sun Pharmaceuticals) | సెల్ | టార్గెట్ ప్రైస్: రూ.735 | స్టాప్ లాస్: రూ.772
రికమెండ్ చేసిన ఎక్స్‌పర్ట్: సమీత్ చౌహాన్, ఏంజెల్ వన్
ఇటీవలి కాలంలో చాలా ఫార్మా స్టాక్స్ పడిపోయినా, ఇది మాత్రం నిలదొక్కుకోగలిగింది. ఇప్పుడు, బీటెన్ డౌన్ స్టాక్స్ పుంజుకుంటున్నాయి, ఇది రివర్స్ సీన్‌లో ఉందని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Gautam Adani: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
Pushpa 2: టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్
Aadhaar Card Update: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?