By: ABP Desam | Updated at : 20 May 2022 10:15 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో ఓపెనయ్యాయి. ఆరంభం నుంచే ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకు ఎగబడ్డారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం సానుకూల సెంటిమెంటుకు దోహదం చేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,163 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1163 పాయింట్ల లాభాల్లో ఉంది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.5.5 లక్షల కోట్ల వరకు సంపద ఆర్జించారు.
BSE Sensex
క్రితం సెషన్లో 52,792 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,513 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 52,792 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీ పైపైకి వెళ్తోంది. 53,958 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 1163 పాయింట్ల లాభంతో 53,934 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 15,809 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16043 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల బాట పట్టింది. 16,003 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. మదుపర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో 16,179 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 353 పాయింట్లు లాభపడి 16,163 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 33,765 వద్ద మొదలైంది. 33,658 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 775 పాయింట్ల లాభంతో 34,091 వద్ద ఉంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 50 కంపెనీలూ లాభాల్లోనే ఉన్నాయి. టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో భారీ లాభాల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు భారీగా ఎగిశాయి. మెటల్ సూచీ 3 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా సూచీలు 2 శాతం లాభపడ్డాయి.
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy