search
×

Stock Market Today: హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డుల మోత

Stock Market at 12 PM, September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్లు నష్టాల్లో విలవిల్లాడుతున్నాయి.

FOLLOW US: 
Share:

Stock Market at 12 PM, September 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్లు నష్టాల్లో విలవిల్లాడుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు తగ్గడంతో అమెరికా సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి. ఈ వ్యవహారం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. సూచీలు ఇంట్రాడేలో సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 66 పాయింట్లు పెరిగి 20,169 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 291 పాయింట్లు పెరిగి 67,843 వద్ద కొనసాగుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 67,519 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,659 వద్ద మొదలైంది. 67,514 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,843 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంలకు 291 పాయింట్ల లాభంతో 67,810 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 20,103 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 20,156 వద్ద ఓపెనైంది. 20,129 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,196 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 66 పాయింట్లు పెరిగి 20,169 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ పెరిగింది. ఉదయం 46,122 వద్ద మొదలైంది. 46,046 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 46,280 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 154 పాయింట్ల లాభంతో 46,155 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఆటో, హీరోమోటో, గ్రాసిమ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐచర్‌ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, టాటా కన్జూమర్‌, బ్రిటానియా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.410 పెరిగి రూ.24,410 వద్ద ఉంది.

క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?

భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఒడుదొడుకులు ఎదురైనా రికార్డు గరిష్ఠాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్లు పెరిగి 20,103 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 52 పాయింట్లు పెరిగి 67,518 వద్ద క్లోజయ్యాయి. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి సూచీలకు మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 83.04 వద్ద స్థిరపడింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 15 Sep 2023 12:34 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రత్యేక ఫార్ములా - యవ్వనం కంటే వృద్ధాప్యంలో ఎక్కువ సంపాదన!

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రత్యేక ఫార్ములా - యవ్వనం కంటే వృద్ధాప్యంలో ఎక్కువ సంపాదన!

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

టాప్ స్టోరీస్

Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ

Telangana Assembly: ఎంపీ స్థానాల పెంపు వాయిదా వేసి మా అసెంబ్లీ సీట్లు పెంచండి- తీర్మానం చేసిన తెలంగాణ

Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 

Kishan Reddy Letter : హెచ్‌సీయూ వద్ద భూములు వేలం వేయొద్దు- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ 

Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?

Empuraan Review - ఎల్2 ఎంపురాన్ రివ్యూ: మోహన్ లాల్ మూవీ హిట్టా? ఫట్టా? రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌కు తగ్గట్టు ఉందా? లేదా?

Vizag Latest News: రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?

Vizag Latest News: రూ.500 ఇవ్వలేదని భర్తపై అలిగిన భార్య- పరుగులు పెట్టిన పోలీసులు - ఇంతకీ ఏం జరిగిందంటే?