By: ABP Desam | Updated at : 23 Sep 2022 03:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market Closing 23 September 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు, రూపాయి పతనంతో బెంచ్‌మార్క్ సూచీలు తీవ్రంగా పతనమయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంటును పెంచాయి. దీనికి తోడు మాంద్యం భయాలు ఆవరించాయి. ఆసియా మార్కెట్లు విలువ ఎక్కువగా ఉండటం, ఐటీ కంపెనీల ఆదాయం, ఇండియా జీడీపీ వృద్ధిరేట్లు, లిక్విడిటీ తగ్గుదల వంటివి ప్రభావం చూపించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 302 పాయింట్ల నష్టంతో 17,327 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 13 పైసలు తగ్గి 80.97 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,119 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,005 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 57,981 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,143 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,442 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,593 వద్ద ఓపెనైంది. 17,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,642 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 302 పాయింట్ల నష్టంతో 17,327 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ నష్టాల్లో క్లోజైంది. ఉదయం 40,429 వద్ద మొదలైంది. 39,412 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,528 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1084 పాయింట్ల నష్టంతో 39,546 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ముగిశాయి. దివిస్ ల్యాబ్, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.5 శాతానికి పైగా నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఐదుగురు దుర్మరణం
Horse Drawn Buggy: గణతంత్ర వేడుకలకు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి.. ఆ చరిత్ర తెలిస్తే వావ్ అనాల్సిందే..!
Balakrishna : వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను - పద్మభూషణ్ పురస్కారంపై బాలకృష్ణ రియాక్షన్ ఇదీ