By: ABP Desam | Updated at : 01 Jun 2022 03:54 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
Stock Market Closing Bell on 1 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప నష్టాలు చవిచూశాయి. ఉదయం నుంచి రేంజ్‌బౌండ్లోనే కదలాడాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ, ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, ద్రవ్యోల్బణం భయాలు మళ్లీ వెంటాడటం మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,522 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 185 పాయింట్ల నష్టాల్లో ముగిశాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,566 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 55,588 వద్ద నష్టాల్లో మొదలైంది. 55,091 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,791 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 185 పాయింట్ల నష్టంతో 55,381 వద్ద ముగిసింది. మొదట్లో కొనుగోళ్ల సందడి కనిపించినా మధ్యాహ్నానికి అమ్మకాలు పెరిగాయి. ఆఖరి 15 నిమిషాల్లో సూచీ మళ్లీ పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి.
NSE Nifty
మంగళవారం 16,584 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16,594 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడింది. 16,438 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,649 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 61 పాయింట్ల నష్టంతో 16,522 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 35,358 వద్ద మొదలైంది. 35,285 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,768 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 133 పాయింట్ల లాభంతో 35,620 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కొటక్ బ్యాంక్, ఎం అండ్ ఎం షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్స్, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. హెల్త్, రియాల్టీ, ఫార్మా, మీడియా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో సూచీలు 1-2 శాతం వరకు పతనం అయ్యాయి.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Gautam Adani: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న అదానీ వ్యవహారం, అసలేం జరిగింది - ఎవరి వర్షన్ ఎలా ఉందంటే!
Pushpa 2: టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్
Aadhaar Card Update: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్‌డేట్ చేసేందుకు మరింత సమయం - ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?