search
×

Stock Market News: సెన్సెక్స్‌, నిఫ్టీ జోష్‌కు తెర! ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stock Market Closing 5 July 2023: స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచీ బెంచ్‌ మార్క్‌ సూచీలు ఊగిసలాడాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 5 July 2023:

స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచీ బెంచ్‌ మార్క్‌ సూచీలు ఊగిసలాడాయి. ఇప్పటికే సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరుకోవడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 9 పాయింట్లు పెరిగి 19,405 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 33 పాయింట్లు తగ్గి 65,446 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే 20 పైసలు బలహీనపడి 82.22 వద్ద స్థిరపడింది. పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎఫ్‌ఎంసీజీ సూచీలు పెరిగాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,479 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,493 వద్ద మొదలైంది. 65,256 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,584 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 33 పాయింట్ల నష్టంతో 65,446 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 19,389 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,405 వద్ద ఓపెనైంది. 19,339 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,421 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 9 పాయింట్ల లాభంతో 19,405 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 45,169 వద్ద మొదలైంది. 45,073 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,418 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 149 పాయింట్లు తగ్గి 45,151 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఆటో, దివిస్‌ ల్యాబ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మారుతీ, హీరోమోటో షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా కన్జూమర్‌, యూపీఎల్‌, ఐచర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌ సూచీలు తగ్గాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరల్లో మార్పేమీ లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,060గా ఉంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.72,200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 పెరిగి రూ.24,150 వద్ద ఉంది. 

Also Read: మణికొండలో రియల్‌ బూమ్‌! 39% పెరిగిన ఇళ్ల ధరలు - హైదరాబాద్‌ రికార్డు!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 05 Jul 2023 03:52 PM (IST) Tags: Nifty Bank Nifty Share Market Stock Market Sensex

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం

Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం

Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు

Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు