search
×

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market Closing 31 May 2023: స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 99 పాయింట్లు తగ్గి 18,534 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 346 పాయింట్లు తగ్గి 62,622 వద్ద ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 31 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల  నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 99 పాయింట్లు తగ్గి 18,534 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 346 పాయింట్లు తగ్గి 62,622 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 82.79 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,969 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,839 వద్ద మొదలైంది. 62,401 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,876 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 346 పాయింట్ల నష్టంతో 62,622 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 18,633 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,594 వద్ద ఓపెనైంది. 18,483 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,603 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 99 పాయింట్లు తగ్గి 18,534 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,318 వద్ద మొదలైంది. 43,822 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,339 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 308 పాయింట్లు తగ్గి 44,128 వద్ద క్లోజైంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.60,930గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.76,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.26,910 వద్ద ఉంది.

Also Read: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్‌ కూడా వస్తాయ్‌

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది

Published at : 31 May 2023 03:58 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి