By: Rama Krishna Paladi | Updated at : 28 Jun 2023 03:54 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 28 June 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఆల్‌టైమ్ హై లెవల్స్‌ను టచ్ చేశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 154 పాయింట్లు పెరిగి 18,972 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 499 పాయింట్లు పెరిగి 63,915 వద్ద ముగిసింది. నిఫ్టీ 19వేలు, సెన్సెక్స్ 64వేల మార్క్‌ను దాటేయడంతో ఇన్వెస్టర్లు ఎగిరి గంతులేశారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.05 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 63,416 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 63,701 వద్ద మొదలైంది. 63,554 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 64,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 499 పాయింట్ల లాభంతో 63,915 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,817 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,908 వద్ద ఓపెనైంది. 18,861 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,011 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 154 పాయింట్ల లాభంతో 18,972 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,419 వద్ద మొదలైంది. 44,163 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,508 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 206 పాయింట్లు పెరిగి 44,327 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టపోయాయి. మీడియా మినహా అన్ని రంగాల సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.58,960గా ఉంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.24,190 వద్ద ఉంది.
Also Read: బుల్ 'కిక్'! హిస్టరీలో తొలిసారి 19000 బ్రేక్ చేసిన నిఫ్టీ
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Don't fall for schemes or messages that claim to give you assured/guaranteed returns in stock market! Please report at Feedbk_invg@nse.co.in or call us at 1800 266 0050 whenever you come across such messages.#NSE #AssuredReturns #StockMarket #InvestorAwareness @ashishchauhan
— NSE India (@NSEIndia) June 28, 2023
FINNIFTY Derivatives touches new high - over 222 million contracts traded.
— NSE India (@NSEIndia) June 28, 2023
We are grateful to all the market participants & intermediaries in achieving this milestone.
#FINNIFTY #FNO #Index #Options #Futures #trading #Derivatives #NSEIndia @ashishchauhan pic.twitter.com/RbS3x6SEsb
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్