search
×

Stock Market News: భారీ నష్టాల నుంచి తేరుకున్న సూచీలు - 16,650 కిందకు నిఫ్టీ!

Stock Market Closing 28 July 2023: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్పంగా ఎరుపెక్కాయి. ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు సాయంత్రానికి రివకరీ అయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 28 July 2023:

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్పంగా ఎరుపెక్కాయి. ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు సాయంత్రానికి రివకరీ అయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 13 పాయింట్లు తగ్గి 19,646 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 106 పాయింట్లు పతనమై 66,160 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు బలహీనపడి 81.94 వద్ద స్థిరపడింది. పవర్‌, రియాల్టీ సూచీలు పెరిగాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 66,266 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,266 వద్ద మొదలైంది. 65,878 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,351 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 106 పాయింట్ల నష్టంతో 66,160 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 19,659 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,659 వద్ద ఓపెనైంది. 19,563 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 13 పాయింట్లు తగ్గి 19,646 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 45,560 వద్ద మొదలైంది. 45,238 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,727 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 211 పాయింట్లు తగ్గి 45,468 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, అపోలో హాస్పిటల్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బీపీసీఎల్‌, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఐటీ, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.60,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2000 తగ్గి రూ.76400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.730 తగ్గి రూ.24,790 వద్ద కొనసాగుతోంది.

Also Read: మ్యూచువల్‌ ఫండ్‌పై లోన్ - ఈఎంఐ లేదు, పైగా తక్కువ వడ్డీ!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 28 Jul 2023 03:46 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

టాప్ స్టోరీస్

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే

Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్

Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్

Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!

Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!