By: ABP Desam | Updated at : 23 Mar 2023 04:07 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 23 March 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం లాభాల్లోనే మొదలైన సూచీలు యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు పెంచడంతో ఒడుదొడుకులకు లోనయ్యాయి. అమెరికా మార్కెట్లు ఓపెనయ్యాక నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 75 పాయింట్లు తగ్గి 17,076 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 289 పాయింట్లు తగ్గి 57,925 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 40 పైసలు బలపడి 82.26 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 58,214 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,061 వద్ద మొదలైంది. 57,838 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,396 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 289 పాయింట్ల నష్టంతో 57,925 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,151 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,097 వద్ద ఓపెనైంది. 17,045 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,205 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 75 పాయింట్లు పతనమై 17,076 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 39,836 వద్ద మొదలైంది. 39,552 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,201 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 382 పాయింట్లు తగ్గి 39,616 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 19 కంపెనీలు లాభాల్లో 30 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, మారుతీ, నెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, కొటక్ బ్యాంకు, హెచ్‌సీఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.59,780 గా ఉంది. కిలో వెండి రూ.1000 ఎగిసి రూ.72,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.26,200 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations to @jswsteel for completing 18 years of #listing at #NSE.#Listed #ListingAnniversary #Nifty50 #Nifty50Companies #ShareMarket #StockMarket @ashishchauhan pic.twitter.com/6scRC4Bsj0
— NSE India (@NSEIndia) March 23, 2023
Congratulations to Global Surfaces Limited on getting #listed on #NSE today. The company is engaged in processing natural stones and manufacturing engineered quartz.#NSE #Listing #IPOListing #NSEIndia #StockMarket #ShareMarket #GlobalSurfaces @ashishchauhan pic.twitter.com/RJtKvQr8gA
— NSE India (@NSEIndia) March 23, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం