By: ABP Desam | Updated at : 20 Mar 2023 03:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 20 March 2023:
స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా, గ్లోబల్ బ్యాంకుల సంక్షోభంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. ఉదయం 800 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ సాయంత్రానికి రికవరీ అయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 94 పాయింట్లు తగ్గి 17,005 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 360 పాయింట్లు తగ్గి 57,628 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.63 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 57,989 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,773 వద్ద మొదలైంది. 57,084 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,829 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 360 పాయింట్ల నష్టంతో 57,628 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,100 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,066 వద్ద ఓపెనైంది. 16,828 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,066 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 94 పాయింట్లు తగ్గి 17,005 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 39,512 వద్ద మొదలైంది. 38,941 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,512 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 236 పాయింట్లు పెరిగి 39,361 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యునీలివర్, బీపీసీఎల్, ఐటీసీ, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.540 తగ్గి రూ.59,780 గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.71,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 తగ్గి రూ.25,790 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
In today's #StockTerm let's look at what Face Value is! Save and share if you found this post helpful.#NSE #StockMarket #ShareMarket #StockTerms #NSEIndia #InvestorEducation #StockMarketIndia #StockExchange #StockTrading #Stocks #Investing #Trading #FaceValue pic.twitter.com/AhkVdXymNa
— NSE India (@NSEIndia) March 20, 2023
Congratulations to MCon Rasayan India Limited on getting listed on NSE Emerge today. Public Issue was of Rs. 684.00 lakhs at an issue price of Rs. 40 per share. #listing #NSE #BellRinging #ShareMarket #StockMarket #IPO #RingTheBell #MConRasayan @ashishchauhan pic.twitter.com/OVDopsuS4m
— NSE India (@NSEIndia) March 20, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి