By: ABP Desam | Updated at : 20 Feb 2023 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 20 February 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు లాభపడ్డాయి. మధ్యాహ్నం తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 99 పాయింట్లు తగ్గి 17,844 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 311 పాయింట్ల పతనమై 61,691 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలపడి 82.73 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,002 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,112 వద్ద మొదలైంది. 60,607 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,290 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 311 పాయింట్ల లాభంతో 61,691 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,944 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,965 వద్ద ఓపెనైంది. 17,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,004 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 99 పాయింట్లు తగ్గి 17,844 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఉదయం 41,221 వద్ద మొదలైంది. 40,580 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,292 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 430 పాయింట్లు తగ్గి 40,701 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 20 కంపెనీలు లాభాల్లో 30 నష్టపోయాయి. దివీస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సెమ్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బీపీసీఎల్, బ్రిటానియా, యూపీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్తబ్దుగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 120 తగ్గి రూ.56,830గా ఉంది. కిలో వెండి రూ.100 తగ్గి రూ.68,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.24,390 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) February 20, 2023
Visit https://t.co/ni4rMKm1RF to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/CpS2Ys7CWK
Shri Sumit Deb, Chairman & Managing Director, NMDC Limited and NMDC Steel Limited along with Shri Nayan Mehta, CFO, @BSEIndia and others ringing the #BSEBell to mark the listing of NMDC Steel Limited on 20th Feb, 2023 at BSE pic.twitter.com/KDRkQ7GwWq
— BSE India (@BSEIndia) February 20, 2023
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
Cuttack ODI Live Score Updates: రాణించిన బ్యాటర్లు.. ఇంగ్లాండ్ భారీ స్కోరు, రూట్, డకెట్ ఫిఫ్టీలు- జడేజాకు 3 వికెట్లు
CM PK: పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసిన ఆహా - జనసేనాని మీద అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో...
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Rashmika Mandanna: గాయం నుంచి కోలుకున్న రష్మిక - ఎయిర్ పోర్టులో హ్యపీగా నడక, వైరల్ వీడియో