By: ABP Desam | Updated at : 17 May 2023 03:55 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : pixel )
Stock Market Closing 17 May 2023:
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. మధ్యాహ్నం వరకు ఎక్కువ పతనమైన సూచీలు కాస్త రికవరీ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 104 పాయింట్లు తగ్గి 18,181 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 377 పాయింట్లు తగ్గి 61,560 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు బలహీనపడి 82.39 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 61,932 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,932 వద్ద మొదలైంది. 61,340 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,979 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 377 పాయింట్ల నష్టంతో 61,560 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 18,286 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,300 వద్ద ఓపెనైంది. 18,115 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,309 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 104 పాయింట్లు తగ్గి 18,181 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,948 వద్ద మొదలైంది. 43,446 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,992 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 205 పాయింట్లు తగ్గి 43,698 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎస్‌బీఐ లైఫ్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.61,420గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.30 పెరిగి రూ.28,170 వద్ద ఉంది.
Also Read: ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి CA అక్కర్లేదు - AIS, TIS డాక్యుమెంట్లు ఉంటే చాలు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Deal only with SEBI registered stockbrokers and transfer funds only to their registered client bank accounts! To know more: https://t.co/jnYKAwNh9g#NSE #NSEIndia #InvestorAwareness #ClientBankAccounts @ashishchauhan pic.twitter.com/bRbYSukytg
— NSE India (@NSEIndia) May 17, 2023
In this segment of #LetsTalkFinance, let's understand what Short Selling is!#InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #StockMarketIndia #StockMarket #Investor #Investment #ShortSelling pic.twitter.com/JULi926old
— NSE India (@NSEIndia) May 16, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు