By: ABP Desam | Updated at : 16 Mar 2023 03:53 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 16 March 2023:
స్టాక్ మార్కెట్లో వరస నష్టాలకు తెరపడింది. గురువారం సూచీలు ఎగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం నెమ్మదించడం మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటు నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 13 పాయింట్లు పెరిగి 16,987 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 78 పాయింట్లు ఎగిసి 57,634 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలహీనపడి 82.74 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 57,555 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,510 వద్ద మొదలైంది. 57,158 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,887 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 78 పాయింట్ల లాభంతో 57,634 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 16,972 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,994 వద్ద ఓపెనైంది. 16,850 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,062 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 13 పాయింట్లు పెరిగి 16,985 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 39,061 వద్ద మొదలైంది. 38,613 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,061 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 81 పాయింట్లు పెరిగి 39,132 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్, హిందుస్థాన్ యునీలివర్, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, మెటల్, ప్రైవేటు బ్యాంకు సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ రంగాల సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ550 పెరిగి రూ.58,420 గా ఉంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.69,200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.25,500 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Ambassador of Norway, Mr. Hans Jacob Frydenlund & other delegates from Consulate of Norway visited @BSEIndia, interacted with Ms. Kamala K, Chief Risk Officer, BSE, rang the #BSEBell & did a photo opp with the #BSEBull on 16th March, 2023. #NorwayinIndia #BSE @norwayinindia pic.twitter.com/p6yyvvtUs9
— BSE India (@BSEIndia) March 16, 2023
Ambassador of Norway, Mr. Hans Jacob Frydenlund & other delegates from Consulate of Norway also visited the #BSE NOC and #CyberSecurity Command Centre pic.twitter.com/Bui670EmF3
— BSE India (@BSEIndia) March 16, 2023
Stock Market News: ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని సూచీలు డౌన్ - సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ రికవరీ!
Financial Year: ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిన 7 ముఖ్యమైన పనులు, లేదంటే ఇబ్బంది పడతారు
Stock Market News: శుక్రవారం స్టాక్ మార్కెట్లో సిరుల పంట - సెన్సెక్స్ 355, నిఫ్టీ 114 అప్!
Stock Market News: అమెరికా ఆగమాగం ఆగని స్టాక్ మార్కెట్ల పతనం - నిఫ్టీ 71, సెన్సెక్స్ 344 డౌన్
Stock Market News: మన స్టాక్ మార్కెట్లను ముంచుతున్న అమెరికా పతనం - సెన్సెక్స్ 337, నిఫ్టీ 111 డౌన్
Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్