By: ABP Desam | Updated at : 16 Jun 2023 03:52 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 16 June 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి అంతరాన్ని పూడ్చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మధ్యాహ్నం వరకు మోస్తరుగా పెరిగిన సూచీలు ఐరోపా మార్కెట్లు తెరవగానే రివ్వున ఎగిశాయి. మదుపర్లు ఎగబడి మరీ బ్యాంకు, ఫైనాన్స్ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 137 పాయింట్లు పెరిగి 18,826 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 466 పాయింట్లు ఎగిసి 63,384 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు బలపడి 81.93 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,917 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,960 వద్ద మొదలైంది. 62,957 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,520 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 466 పాయింట్ల లాభంతో 63,384 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 18,688 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,723 వద్ద ఓపెనైంది. 18,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,864 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 137 పాయింట్లు పెరిగి 18,826 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,583 వద్ద మొదలైంది. 43,536 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,083 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 494 పాయింట్లు ఎగిసి 43,938 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్‌సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఆటో, విప్రో, టీసీఎస్, ఓఎన్జీసీ, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, రియాల్టీ మినహా మిగతా రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.60,110గా ఉంది. కిలో వెండి రూ.73,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 పెరిగి రూ.26,000 వద్ద ఉంది.
Also Read: ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్ FDs, ఈ నెల వరకే ఈ గోల్డెన్ ఛాన్స్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Attention Investors! Key considerations for smart investors when signing a Power of Attorney (PoA). Know more: https://t.co/9wkVNEad7M#NSE #NSEIndia #PoA #SochKarSamajhKarInvestKar @ashishchauhan pic.twitter.com/BOkQTZi6JA
— NSE India (@NSEIndia) June 16, 2023
MIDCPNIFTY Derivatives touches new high - over 38 lakhs contracts traded.
— NSE India (@NSEIndia) June 16, 2023
We are grateful to all the market participants & intermediaries in achieving this milestone.#MIDCPNIFTY #FNO #Index #Options #Futures #trading #Derivatives #NSEIndia @ashishchauhan pic.twitter.com/dULj2SEaEu
_ price is the price for orders after the orders get triggered from the stop loss book
— NSE India (@NSEIndia) June 15, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Swarna Kuppam Vision 2029 : సొంత నియోజకవర్గంలో పర్యటన - స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Cherlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ, కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని
Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ వెయిటింగ్ పీరియడ్ ఎంత - డబ్బులు కట్టినా ఎన్నాళ్లు ఆగాలి?
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్