By: ABP Desam | Updated at : 15 Mar 2023 04:14 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 15 March 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా బ్యాంకుల దివాలా, యూఎస్ ఎకానమీ మందగమనం వంటివి మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 71 పాయింట్లు తగ్గి 16,972 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 344 పాయింట్లు పతనమై 57,555 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 బలపడి 82.32 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 57,900 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,268 వద్ద మొదలైంది. 57,455 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,473 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 344 పాయింట్ల నష్టంతో 57,555 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,043 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,166 వద్ద ఓపెనైంది. 16,938 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,211 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 71 పాయింట్లు పతనమై 16,972 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 39,777 వద్ద మొదలైంది. 38,934 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,914 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 359 పాయింట్లు తగ్గి 39,051 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యునీలివర్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.57,870 గా ఉంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.69,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.26,050 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) March 15, 2023
Visit https://t.co/ni4rMKm1RF to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/v1TDJqdHWp
Sensex opens at 58268 with a gain of 368 points pic.twitter.com/h7qTvANRbU
— BSE India (@BSEIndia) March 15, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లపై సమీక్ష
PM Modi Vizag Tour: దేశానికే గేమ్ ఛేంజర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
AR Rahman - Anirudh Ravichander: ఆ ఒక్క పని చేయండి... అనిరుధ్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సలహా