search
×

Stock Market News: నష్టాల నుంచి రికవరీ - సెన్సెక్స్‌ 123 అప్‌, నిఫ్టీ 18,330 పైనే క్లోజింగ్‌!

Stock Market Closing 12 May 2023: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం ఎరుపెక్కిన సూచీలు సాయంత్రానికి రికవరీ అయ్యాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 12 May 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం ఎరుపెక్కిన సూచీలు సాయంత్రానికి రికవరీ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17 పాయింట్లు పెరిగి 18,314 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 123 పాయింట్లు ఎగిసి 62,027 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలహీన పడి 82.16 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,904 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,857 వద్ద మొదలైంది. 61,578 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,110 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 123 పాయింట్ల లాభంతో 62,027 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 18,297 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,273 వద్ద ఓపెనైంది. 18,194 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,342 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 17 పాయింట్లు పెరిగి 18,314 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 43,447 వద్ద మొదలైంది. 43,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,905 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 318 పాయింట్లు ఎగిసి 43,793 వద్ద క్లోజైంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. ఐచర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, బీపీసీఎల్‌, పవర్ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ ఎగిశాయి. ఐటీ, మీడియా, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.62,130గా ఉంది. కిలో వెండి రూ.2600 తగ్గి రూ.75,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.28,590 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 12 May 2023 03:51 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

టాప్ స్టోరీస్

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?

KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం

KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం

Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?

Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?