By: ABP Desam | Updated at : 08 Feb 2023 03:56 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 08 February 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. మెరుగైన జీడీపీ వృద్ధిరేటు అంచనాలు, రెపోరేటు పెరుగుదల, అదానీ గ్రూప్ షేర్లు రాణించడంతో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 150 పాయింట్ల లాభంతో 17,871 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 377 పాయింట్ల లాభంతో 60,663 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలపడి 82.49 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,286 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,332 వద్ద మొదలైంది. 60,324 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,792 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 377 పాయింట్ల లాభంతో 60,663 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,721 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,750 వద్ద ఓపెనైంది. 17,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,878 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 150 పాయింట్ల లాభంతో 17,871 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ స్వల్పంగా లాభపడింది. ఉదయం 41,542 వద్ద మొదలైంది. 41,403 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,791 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 46 పాయింట్లు పెరిగి 41,537 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీ, ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, హీరోమోటో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి. ఆటో, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Price)
విలువైన లోహాల ధరల్లో మార్పు లేదు. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.57,550 వద్ద ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.71,400 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల ప్లాటినం రూ.100 పెరిగి రూ.25,960 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Don't fall for false promises of assured returns. Do your own research before investing in Securities Market.#SochKarSamajhKarInvestKar #AssuredReturns #NSE #NSEIndia #InvestorAwareness #StockMarket #StockMarketIndia #StockExchange @ashishchauhan @psubbaraman
— NSE India (@NSEIndia) February 8, 2023
Market Update for the day.
— NSE India (@NSEIndia) February 7, 2023
See more:https://t.co/XW5Vr5nX8chttps://t.co/hyRwDLLexj#NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/iteK8TCvc5
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 67 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్ చేతికి మరో అస్త్రం
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ