Stock Market Closing 06 September 2023:
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం రోజువారీ కనిష్ఠాల్లోకి జారుకున్నాయి. ఆఖరి అరగంటలో అనూహ్యంగా పుంజుకొని నష్టాలను పూడ్చుకున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్లు పెరిగి 19,611 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 100 పాయింట్లు పెరిగి 65,880 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,780 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,744 వద్ద మొదలైంది. 65,488 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,971 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 100 పాయింట్ల లాభంతో 65,880 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 19,574 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,581 వద్ద ఓపెనైంది. 19,491 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 36 పాయింట్లు పెరిగి 19,611 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 44,494 వద్ద మొదలైంది. 44,207 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,577 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 123 పాయింట్లు తగ్గి 44,409 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 27 నష్టాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్స్ (4.11%), దివిస్ ల్యాబ్ (1.77%), భారతీ ఎయిర్‌టెల్ (1.62%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (1.53%), బ్రిటానియా (1.44%) షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్ (1.71%), హిందాల్కో (1.65%), యాక్సిస్ బ్యాంక్ (1.48%), ఎన్టీపీసీ (1.32%), ఇండస్‌ఇండ్ బ్యాంకు (1.30%) షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.610 తగ్గి రూ.24,640 వద్ద ఉంది.
Also Read: సూపర్ డూపర్ అప్‌డేట్ - షేర్లు అమ్మినా, కొన్నా తక్షణమే సెటిల్‌మెంట్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.