Stock Market at 12PM, 05 September 2023: 


స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం రోజువారీ కనిష్ఠాల్లోకి జారుకున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్లు తగ్గి 19,544 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 105 పాయింట్లు తగ్గి 65,674 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,780 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,744 వద్ద మొదలైంది. 65,639 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,870 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 105 పాయింట్ల నష్టంతో 65,674 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 19,574 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,581 వద్ద ఓపెనైంది. 19,534 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,604 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 30 పాయింట్లు తగ్గి 19,544 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,494 వద్ద మొదలైంది. 44,318 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,577 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 203 పాయింట్లు తగ్గి 44,328 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, సిప్లా, బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, జియో ఫైనాన్స్‌, హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.610 తగ్గి రూ.24,640 వద్ద ఉంది.


Also Read: సూపర్‌ డూపర్‌ అప్‌డేట్‌ - షేర్లు అమ్మినా, కొన్నా తక్షణమే సెటిల్‌మెంట్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.