search
×

Stock Market Today: వరుసగా మూడో సెషన్లో లాభాలే! 19,550 మీదే నిఫ్టీ క్లోజింగ్‌

Stock Market Closing, 05 September 2023: స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing, 05 September 2023: 

స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. స్మాల్‌, మిడ్‌ క్యాప్ సూచీలు దుమ్మురేపుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 46 పాయింట్లు పెరిగి 19,574 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 152 పాయింట్లు పెరిగి 65,780 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 29 పైసలు బలహీనపడి 83.04 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,628 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,671 వద్ద మొదలైంది. 65,601 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,831 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 152 పాయింట్ల లాభంతో 65,780 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 19,528 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,564 వద్ద ఓపెనైంది. 19,525 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,587 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 46 పాయింట్లు పెరిగి 19,574 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,625 వద్ద మొదలైంది. 44,401 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,668 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 46 పాయింట్లు తగ్గి 44,532 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 46 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్ (3.22%), కోల్‌ ఇండియా (3.07%), సన్ ఫార్మా (2.08%), బీపీసీఎల్‌ (1.54%), ఐటీసీ (1.52%) షేర్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సెమ్‌ (1.49%), డాక్టర్‌ రెడ్డీస్‌ (1.40%), ఎస్బీఐ లైఫ్ (1.31%), మారుతీ (1.03%), ఐచర్‌ మోటార్స్‌ (0.73%) షేర్లు నష్టపోయాయి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఎప్పట్లాగే అదరగొట్టాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.60,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.1000 తగ్గి రూ.76,200 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.25,250 వద్ద ఉంది.

Also Read: ఉద్యోగం పోయినా.. కంపెనీ ఇన్సూరెన్స్‌ పొందడం ఎలా?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 05 Sep 2023 03:52 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 20,200 టచ్‌ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279