search
×

Stock Market News: మూడు రోజుల క్రాష్‌కు చెక్‌! 19,500 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - సెన్సెక్స్‌ 491 పాయింట్లు అప్‌

Stock Market Closing 04 August 2023: మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 04 August 2023:

మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఐఐలు, డీఐఐలు మళ్లీ కొనుగోళ్లు చేపట్టారు. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలే అందడంతో ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మొత్తానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 135 పాయింట్లు పెరిగి 19,517 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 480 పాయింట్లు పెరిగి 65,721 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలహీనపడి 82.84 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,240 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,453 వద్ద మొదలైంది. 65,387 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,799 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 480 పాయింట్ల లాభంతో 65,721 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

గురువారం 19,381 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,462 వద్ద ఓపెనైంది. 19,436 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,538 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 135 పాయింట్లు పెరిగి 19,517 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,754 వద్ద మొదలైంది. 44,520 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,118 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 366 పాయింట్లు పెరిగి 44,879 వద్ద ముగిసింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. సిప్లా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. ఎస్బీఐ, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, మారుతీ, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.59,950 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2300 తగ్గి రూ.75000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.24,420 వద్ద కొనసాగుతోంది.

Also Read: మీకు రూ.15,490 రీఫండ్‌ వస్తోంది! ఆ మెసేజ్‌ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్‌!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 Aug 2023 03:55 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank Stock Market news BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Monthly Income: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్‌ విత్‌డ్రాల్‌ ప్లాన్‌

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIPs: 'సిప్‌' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్‌ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్‌ వచ్చాయి, సిప్‌ చేసిన మ్యాజిక్‌ ఇది

టాప్ స్టోరీస్

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు