By: ABP Desam | Updated at : 03 Apr 2023 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 03 April 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. ఒపెక్ దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిలో కోత విధించడం, ఆర్బీఐ మానిటరీ కమిటీ సమావేశం మొదలవ్వడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 17,398 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 114 పాయింట్లు పెరిగి 59,106 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 16 పైసలు బలహీనపడి 82.33 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 58,991 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,131 వద్ద మొదలైంది. 58,93 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,204 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 114 పాయింట్ల లాభంతో 59,106 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 17,359 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,359 వద్ద ఓపెనైంది. 17,312 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,428 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 40,695 వద్ద మొదలైంది. 40,535 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,857 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 204 పాయింట్లు పెరిగి 40,813 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ముగిశాయి. హీరోమోటో కార్ప్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, మారుతీ, దివిస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.59,670 గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.140 తగ్గి రూ.26,010 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Press Release: Cogencis to offer premium Dow Jones global news to its WorkStation users. Read more - https://t.co/koErwGh2mJ #PressRelease #NSECogencis #DowJones #CogencisTerminal #real-time #newsstream @ashishchauhan pic.twitter.com/KiP9yjytDs
— NSE India (@NSEIndia) April 3, 2023
Congratulations to IRB Infrastructure Trust (InvITs) for getting listed on NSE#NSE #Listing #NSEIndia #StockMarket #ShareMarket @ashishchauhan pic.twitter.com/u38ArLOspM
— NSE India (@NSEIndia) April 3, 2023
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Monthly Income: మ్యూచువల్ ఫండ్ నుంచి నెలనెలా ఆదాయాన్ని ఇచ్చే సిస్టమాటిక్ విత్‌డ్రాల్ ప్లాన్
Investment Options: 'గోడ మీద పిల్లి' ఫార్ములా, మ్యూచువల్ ఫండ్స్‌లో బాగా పని చేస్తుంది
Mutual Fund SIPs: 'సిప్' పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు
Mutual Fund SIP: ₹10,000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా ₹2.10 కోట్లు రిటర్న్ వచ్చాయి, సిప్ చేసిన మ్యాజిక్ ఇది
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
/body>