Stock Market at 12 PM, 07 September 2023: 


స్టాక్‌ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు మధ్యాహ్నం నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) ఒక పాయింటు పెరిగి 19,612 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 25 పాయింట్లు తగ్గి 65,854 వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ షేర్లు పుంజుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలపై ఒత్తిడి నెలకొంది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,880 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,854 వద్ద మొదలైంది. 65,672 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,991 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 25 పాయింట్ల నష్టంతో 65,854 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 19,611 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,598 వద్ద ఓపెనైంది. 19,550 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,642 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం ఒక పాయింటు పెరిగి 19,612 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 44,418 వద్ద మొదలైంది. 44,341 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,689 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 56 పాయింట్లు ఎగిసి 44,465 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ఉన్నాయి. కోల్‌ ఇండియా, ఎల్‌టీ, టెక్‌ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఎం అండ్‌ ఎం, బ్రిటానియా, సిప్లా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాల సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. ఫైనాన్స్‌, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.59,890 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.24,350 వద్ద ఉంది.


నిన్న ఏం జరిగిందంటే?


స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం రోజువారీ కనిష్ఠాల్లోకి జారుకున్నాయి. ఆఖరి అరగంటలో అనూహ్యంగా పుంజుకొని నష్టాలను పూడ్చుకున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్లు పెరిగి 19,611 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 100 పాయింట్లు పెరిగి 65,880 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు తగ్గి 83.13 వద్ద స్థిరపడింది.


Also Read: అలియా భట్‌తో రిలయన్స్‌ డీల్‌, మూడేళ్ల కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.