By: ABP Desam | Updated at : 21 Oct 2022 03:21 PM (IST)
Edited By: Arunmali
దీపావళి జువ్వలా దూసుకెళ్లిన కెనరా బ్యాంక్ షేర్
Canara Bank Shares: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో లాభాన్ని రెట్టింపు చేసి చూపడంతో, ప్రభుత్వ యాజమాన్యంలో పని చేసే కెనరా బ్యాంక్ షేర్లు ఇవాళ్టి (శుక్రవారం) ఇంట్రాడే ట్రేడ్‌లో 4.6 శాతం పెరిగి రూ. 270.90కి చేరుకున్నాయి. ఈ కౌంటర్ 52 వారాల గరిష్ట స్థాయి అయిన రూ. 272.80 మార్క్ సమీపంలోకి వెళ్లాయి.
నిన్నటి (గురువారం) ముగింపు ధర రూ. 258.90తో పోలిస్తే, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఈ స్క్రిప్ 3.75 శాతం పెరిగి రూ. 268.60 వద్ద ట్రేడవుతోంది.
గత ఆరు నెలల కాలంలో ఈ స్టాక్ ధర 35 రూపాయలు లేదా 15 శాతం పైగా పెరిగింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే, 69 రూపాయలు లేదా 35 శాతం ర్యాలీ చేసింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు (YTD) 63 రూపాయలు లేదా 31 శాతం పెరిగింది.
Q2 ఫలితాలు
సెప్టెంబర్ త్రైమాసికంలో, కెనరా బ్యాంక్ రూ. 2,525 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో మిగిలిన రూ. 1,333 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 89 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం గత ఏడాదిలోని రూ. 21,331.49 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 24,932.19 కోట్లకు (YoY) పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ పేర్కొంది.
నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 6,273 కోట్ల నుంచి 18.54 శాతం (YoY) వృద్ధితో పెరిగి రూ. 7,434 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 2.73 శాతం నుంచి 2.83 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం (ఆపరేటింగ్ ప్రాఫిట్) 23 శాతం పెరిగి రూ. 6,905 కోట్లకు చేరింది.
స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని 8.42 శాతం నుంచి ఇప్పుడు 6.37 శాతానికి (YoY) తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు (NNPAs) కూడా 3.22 శాతం నుంచి తగ్గి 2.19 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలు, ఆకస్మిక వ్యయాల కోసం చేసే కేటాయింపులు (Provisions) రూ. 2,678.48 కోట్ల నుంచి రూ. 2,745.03 కోట్లకు పెరిగాయి. కేటాయింపులు పెరగడం ఆందోళనకర విషయం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం రుణ వృద్ధిని సాధిస్తామని కెనరా బ్యాంక్ గెడెన్స్ ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP , PPFలో లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?
Investments for Child : పిల్లల ఫ్యూచర్ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్‌తో అధిక రాబడి మీ సొంతం
Children Day: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Passive Income: SIPs నుంచి REITs దాకా పాసివ్ ఆదాయం ఎలా సంపాదించాలో తెలుసుకోండి
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy