search
×

Demat Account: డీమ్యాట్‌ అకౌంట్ల రికార్డు బ్రేక్‌! జులైలో 30 లక్షలు ఓపెనింగ్‌!

Demat Account: డీమ్యాట్‌ ఓపెనింగ్స్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. జులై నెలలో ఎన్‌ఎస్‌డీఎల్‌, సీడీఎస్‌ఎల్‌ వద్ద ఏకంగా 30 లక్షల వరకు కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరిచినట్టు సమాచారం.

FOLLOW US: 
Share:

Demat Account: 

డీమ్యాట్‌ ఓపెనింగ్స్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలకు చేరుకోవడం, ఇంకా పెరుగుతాయన్న ఆత్మవిశ్వాసం, రిటైల్‌ ఇన్వెస్టర్ల ఆసక్తే ఇందుకు కారణాలు. జులై నెలలో ఎన్‌ఎస్‌డీఎల్‌, సీడీఎస్‌ఎల్‌ వద్ద ఏకంగా 30 లక్షల వరకు కొత్త డీమ్యాట్‌ ఖాతాలు (Demat Accounts) తెరిచినట్టు సమాచారం. ఇది 2022, జనవరి గరిష్ఠ సంఖ్య కన్నా ఎక్కువే. చివరి 12 నెలల సగటు సంఖ్య 20 లక్షల కన్నా ఎంతో ఎక్కువ. అంతేకాకుండా మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 12.35 కోట్లకు చేరుకుంది.

మార్కెట్‌ సెంటిమెంటు సానుకూలంగా ఉండటంతో రిటైల్‌ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్‌ క్రమంగా పెరుగుతోంది. బెంచ్‌మార్క్‌ నిఫ్టీ, సెన్సెక్స్‌ను మించి మైక్రో క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు పెరగడం వంటివి ఆకర్షణీయంగా మారాయి. 'మార్కెట్లు బూమ్‌లో ఉండటం, సెన్సెక్స్‌, నిఫ్టీ సరి కొత్త గరిష్ఠాలకు చేరుకోవడం, డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ప్రాచుర్యం పెరగడం వంటివి డీమ్యాట్‌ ఖాతాల పెరుగుదలకు కారణాలు. అలాగే విదేశీ, స్థానిక సంస్థాగత మదుపర్లు పోటీపడి మరీ పెట్టుబడులు పెడుతున్నారు. ఐపీవో మార్కెట్‌ బూమింగ్‌లో ఉండటం ఇన్వెస్టర్లను ఊరిస్తోంది' అని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌ సింగ్‌ నందా అంటున్నారు.

కొన్ని సెషన్ల నుంచి మార్కెట్లు కరెక్షన్‌ అవుతున్నాయి. చివరి తొమ్మిది సెషన్లలో బెంచ్‌మార్క్‌ నిఫ్టీ, సెన్సెక్స్‌ ఎరుపెక్కాయి. అయితే పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సూచీలు ఇంతకన్నా కిందకు పడిపోవన్న అంచనాలతో డబ్బుల్ని పంపింగ్‌ చేస్తున్నారు. మౌలికసదుపాయాలు, రియల్ ఎస్టేట్‌లో కొత్త ఊపు రావడం, ప్రైవేటు కంపెనీలు విస్తరణ చేపట్టడం, కార్పొరేట్‌ ప్రాఫిట్‌ పెరుగుదల వంటివి మార్కెట్లకు ఊతం ఇస్తున్నాయి.

'నాణ్యమైన స్టాక్స్‌ను సొంతం చేసుకొనేందుకు కరెక్షన్‌ మంచి అవకాశం. ఇలాంటప్పుడే 3-5 ఏళ్ల కాల పరిమితితో ఇన్వెస్ట్‌ చేస్తుంటాం. అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ను ఫిచ్ తగ్గించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా డౌన్‌ ట్రెండ్‌ మొదలైంది. మరికొన్ని రోజుల్లో మార్కెట్లలో స్థిరత్వం వస్తుంది' అని బీఎన్‌పీ పారిబస్‌ చీఫ్ బిజినెస్‌ ఆఫీసర్ పర్మిందర్‌ వర్మ అన్నారు. వీటికి తోడుగా నిఫ్టీ వాల్యుయేషన్‌ 19 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉంది. రాబోయే సంవత్సరాల్లో కంపెనీలు మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపి ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటు నింపాయి.

నేటి మార్కెట్‌

రెండు రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్లు మొదలు పెట్టాడు. బెంచ్‌మార్క్‌ సూచీలకు కీలక స్థాయిల్లో సపోర్ట్‌ లభించింది. ఉదయం నుంచే ఇన్వెస్టర్లు యాక్టివ్‌గా బయింగ్‌ చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 133 పాయింట్లు పెరిగి 19,515 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 462 పాయింట్లు పెరిగి 65,702 వద్ద కొనసాగుతున్నాయి. జొమాటో, డిక్సన్‌ టెక్నాలజీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాక్టివ్‌గా ఉన్నాయి.

Also Read: మీకు రూ.15,490 రీఫండ్‌ వస్తోంది! ఆ మెసేజ్‌ అస్సలు తెరవొద్దని ఐటీ శాఖ వార్నింగ్‌!

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 Aug 2023 01:26 PM (IST) Tags: Stock Market Demat account Retail investors

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్

Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్

Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?

Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?

Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే

Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే

Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం

Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం