By: ABP Desam | Updated at : 03 Jun 2023 03:56 PM (IST)
స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్ క్యాప్ ఫండ్స్
Small Cap Mutual Funds: నాకు వివేక్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఫలానా షేర్లలో పెట్టుబడి పెడితే డబ్బు 6 నెలల్లో రెట్టింపు అవుతుందని అతనికి ఎవరో చెప్పారు. వివేక్ ఆ షేర్లను కొన్నాడు. ఆరు నెలల తర్వాత చూసుకుంటే, డబ్బు రెట్టింపు కాలేదు సరికదా, సగానికి సగం తగ్గింది. వివేక్ లాగే చాలామంది షేర్ల విషయంలో అవివేకంగా ఆలోచిస్తున్నారు. లాభపడడానికి బదులు నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్ గురించి తెలీనప్పుడు, ఎవరో దారినపోయే దానయ్య మాట విని పెట్టుబడి పెట్టడం మూర్ఖత్వం. నేరుగా షేర్లలోకి డబ్బులు పంప్ చేయాలంటే మార్కెట్ మీద అవగాహన ఉండాలి. మార్కెట్‌లో ఒడిదొడుకులను తట్టుకుని నిలబడగలగాలి.
స్టాక్ మార్కెట్ గురించి తెలీకపోతే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టకూడదా అంటే, పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వేల కోట్ల విలువైన పెట్టుబడులను మేనేజ్ చేస్తుంటాయి. వాటికి సొంత రీసెర్చ్ టీమ్‌లు ఉంటాయి. ప్రతి ఫండ్‌కు, ఎక్స్‌పర్ట్ అయిన ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ కోసం స్టాక్స్‌ను ఎంచుకునేటప్పుడు మెరుగైన రాబడి ఇచ్చేవాటిని తీసుకుంటాడు. మార్కెట్ పరిస్థితి బాగోలేకపోతే నష్టాలిచ్చే షేర్లను వెంటనే అమ్మేస్తాడు. ఫైనల్‌గా, బెటర్ రిటర్న్స్ రాబట్టడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి, మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉత్తమ పెట్టుబడి మార్గం.
గత మూడేళ్లలో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ ఫండ్స్:
గత 3 సంవత్సరాల్లో, కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచవల్ ఫండ్స్ 65% వరకు లాభాలను అందించాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 65.26 శాతం రాబడిని ఇచ్చింది, ఈ విభాగంలో ఇదే అత్యధికం. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 49.90 శాతం రాబడితో రెండో స్థానంలో నిలిచింది. ICICI ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్ థర్డ్ ప్లేస్‌లో ఉంది, ఇది 47.56 శాతం రాబడిని ఇచ్చింది. ఇదే కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ 47.18 శాతం రిటర్న్ అందించింది. హెచ్‌ఎస్‌బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ 46.46 శాతం, కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ 46.26 శాతం రాబడిని ఇచ్చాయి. టాటా స్మాల్ క్యాప్ ఫండ్ 46.10 శాతం, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 45.79 శాతం లాభాన్ని తీసుకొచ్చాయి.
స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి?
స్మాల్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు విపరీతంగా పెరిగే గుణం ఉంది, రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ కంపెనీల ఫండమెంటల్స్ బాగుంటే, ఈ స్టాక్సే భవిష్యత్తులో మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌గా ఎదుగుతాయి. రూ. 5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీలు అంటారు. మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం ప్రకారం, మీరు దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, మంచి రాబడి కోసం స్మాల్ క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy