search
×

Stock Market News: కమ్ముకున్న నెగెటివ్‌ సెంటిమెంట్‌! సెన్సెక్స్‌ 300, నిఫ్టీ 70 డౌన్‌

Stock Market Opening Bell on 31 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,591 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 312 పాయింట్ల నష్టాల్లో ఉంది.

FOLLOW US: 
Share:

Stock Market Opening Bell on 31 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే మదుపర్లు అమ్మకాలు చేపట్టారు.  ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,591 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 312 పాయింట్ల నష్టాల్లో ఉంది.

BSE Sensex

క్రితం సెషన్లో 55,925  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,622 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఆరంభం నుంచే అమ్మకాల జోరు కనిపించింది. 55,386 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,659 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 312 పాయింట్ల నష్టంతో 55,606 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

సోమవారం 16,661 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,578 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. 16,521 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,599 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 70 పాయింట్ల నష్టంతో 16,591 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 35,615 వద్ద మొదలైంది. 35,579 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,753 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 93 పాయింట్ల నష్టంతో 35,733 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ ఫార్మా, టైటాన్‌, హిందుస్థాన్‌ యనీలివర్‌, కొటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ నష్టాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి. మిగతావన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌, రియాల్టీ షేర్లు కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంక్స్‌ స్టాక్స్‌ సెల్లింగ్‌ ప్రెజర్‌లో ఉన్నాయి.

Published at : 31 May 2022 10:37 AM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Russia Ukraine War : ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?

Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?

Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్

Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్

HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు

YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy