By: ABP Desam | Updated at : 05 Jan 2024 03:59 PM (IST)
మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ కూడా తీసుకోవచ్చు, వడ్డీ తక్కువే!
Loan Against Mutual Funds: చాలా మంది మ్యూచువల్ ఫండ్ (MF) ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతారు. షేర్ల తరహాలో తక్కువ కాలం కోసం వీటిని ఎంచుకోరు. ఎందుకంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో తక్కువ కాలం పెట్టుబడుల వల్ల ప్రయోజనం ఉండదు.
కనీసం 10 సంవత్సరాలకు తగ్గకుండా, క్రమశిక్షణతో మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టే పెట్టుబడులు భారీ సంపదను (కార్పస్ ఫండ్) సృష్టిస్తాయి. MF స్కీమ్స్‌లో, SIP మార్గంలో టైమ్ టు టైమ్ తక్కువ మొత్తాలతో పెట్టుబడిని కొనసాగించవచ్చు. లేదా, ఒకే విడతలో పెద్ద మొత్తాన్ని సింగిల్ పేమెంట్ రూపంలో పంప్ చేయవచ్చు. పెట్టుబడిదారు వెసులుబాటు, స్థోమతను బట్టి పెట్టుబడి విధానం మారుతుంది.
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు లాంగ్ టర్మ్ గోల్స్‌తో పెట్టుబడి పెట్టినా.. మధ్యలో ఊహించని ఆర్థిక అవసరాలు రావచ్చు. ఆ సమయంలో, తమ పెట్టుబడిని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల, ఆ వ్యక్తి ఏ లక్ష్యం కోసం పెట్టుబడిని ప్రారంభించారో అది నెరవేరదు.
అసాధారణ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ డబ్బును వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక వెసులుబాటు ఉంది. MF అసెట్స్‌ను వెనక్కు తీసుకోవడానికి బదులు, ఆ పెట్టుబడులపై లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక అవసరం తీరుతుంది, మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి కూడా కొనసాగుతుంది. మ్యూచువల్ ఫండ్ అసెట్స్ మీద లోన్ తీసుకుంటే, ఆ యూనిట్లు తాత్కాలికంగా ఫ్రీజ్ అవుతాయి, పెట్టుబడిదారు హక్కు తగ్గుతుంది. లోన్ క్లియర్ చేయగానే మళ్లీ పూర్తిస్థాయిలో హక్కు తిరిగి వస్తుంది.
ఇన్వెస్టర్లు, తమ మ్యూచువల్ ఫండ్స్‌ను తనఖా పెట్టి ఏదైనా బ్యాంక్/ఫైనాన్సింగ్ కంపెనీ నుంచి లోన్ తీసుకోవచ్చు. సాధారణంగా, అన్-సెక్యూర్డ్ లోన్స్ కంటే తక్కువ వడ్డీ రేటుకే మ్యూచువల్ ఫండ్ అసెట్స్ మీద రుణం దొరుకుతుంది.
మ్యూచువల్ ఫండ్ మీద లోన్ తీసుకోవడానికి అర్హతలు, ఇతర వివరాలు:
- వ్యక్తిగత పెట్టుబడిదార్లు, NRIలు, వ్యాపారస్తులు, HUFలు, ట్రస్టులు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు మ్యూచువల్ ఫండ్ ఆస్తులపై రుణం తీసుకోవచ్చు. మైనర్లకు అనుమతి లేదు.
- బ్యాంక్/ఫైనాన్సింగ్ సంస్థ.. దరఖాస్తుదారు క్రెడిట్ స్కోర్, వివిధ ప్రమాణాల ఆధారంగా రుణ మొత్తం, కాల పరిమితి, వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.
- ఈ తరహా లోన్ కోసం ఆన్‌లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.
- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే, నెట్ అసెట్ వాల్యూలో 50% వరకు లోన్ దొరుకుతుంది.
- స్థిర ఆదాయ మ్యూచువల్ ఫండ్స్‌లో, నికర ఆస్తి విలువలో 70-80% వరకు రుణం అందుబాటులోకి వస్తుంది.
- ఇది తనాఖా రుణం (collateral loan) కాబట్టి, పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీకే మ్యూచువల్ ఫండ్స్ మీద రుణం లభిస్తుంది.
- పెట్టుబడిదారుకు మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంటే, తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది.
- ప్రాసెసింగ్ ఫీజ్ లేదా ముందస్తు రుణం చెల్లింపు (foreclosure) ఛార్జీ కూడా తగ్గొచ్చు లేదా పూర్తిగా మాఫీ కావొచ్చు.
గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని విషయాలు:
- రుణంలో కొంత భాగాన్ని చెల్లిస్తే, ఆ మేరకు మ్యూచువల్ ఫండ్ యూనిట్లు తాకట్టు నుంచి రిలీజ్ అవుతాయి.
- తాకట్టు యూనిట్లపై ఇన్వెస్టర్‌కు తాత్కాలిక హక్కు ఉన్నప్పటికీ డివిడెండ్స్ పొందడంతో పాటు, యూనిట్లలో వృద్ధి కొనసాగుతుంది.
- బ్యాంక్/ఫైనాన్సింగ్ కంపెనీ ఆధీనంలో ఉన్న యూనిట్లను పెట్టుబడిదారు రీడీమ్ చేయలేడు.
మరో ఆసక్తికర కథనం: బాస్ ఈ బ్యాక్ - ఇప్పుడు రిచెస్ట్ ఇండియన్ అంబానీ కాదు, అదానీ
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?