search
×

Mutual Funds: ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదార్లు అదృష్టవంతులు, భారీ లాభాలు కళ్లజూశారు

గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ50 ఇండెక్స్‌ కూడా దాదాపు 30 శాతం పెరిగింది.

FOLLOW US: 
Share:

Best Mutual Fund Returns: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే మార్గాల్లో మ్యూచువల్‌ ఫండ్‌ (MF) ఒకటి. నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం కన్నా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిస్క్‌ తగ్గుతుంది. షేర్లు కొనాలన్న కోరిక ఉన్నా... మార్కెట్‌పై ఫోకస్‌ పెట్టేంత సమయం లేనివాళ్లకు, కొత్త వాళ్లకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఒక ఉత్తమ మార్గం.

2023-24 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్‌ ఫండ్లు చక్కగా రాణించాయి. లార్జ్ క్యాప్‌, మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ పథకాలు పెట్టుబడిదార్లకు మంచి లాభాలను అందించాయి. 2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చాలా మ్యూచువల్ ఫండ్స్ 40 నుంచి 50 శాతం రాబడి ఇచ్చాయి. స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి అధిక రాబడి లభించింది. గత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ50 ఇండెక్స్‌ కూడా దాదాపు 30 శాతం పెరిగింది. 

2023-24లో మెరుగైన రిటర్న్‌ అందించిన మ్యూచువల్ ఫండ్స్‌

స్మాల్ క్యాప్ ఫండ్స్ (Small cap funds) 
స్మాల్ క్యాప్ ఫండ్స్ గత ఏడాది బాగా పెర్ఫార్మ్‌ చేశాయి. బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక సంవత్సరంలో 69 శాతం రాబడిని ఇచ్చింది. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 66 శాతం, మహీంద్ర మ్యానులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్ 65 శాతం, ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 62 శాతం రిటర్న్‌ ఇచ్చాయి.

మిడ్ క్యాప్ ఫండ్స్ (Mid Cap Funds)
గత ఆర్థిక సంవత్సరంలో, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 65 శాతం పెరిగింది. ఐటీఐ మిడ్ క్యాప్ ఫండ్ 62 శాతం లాభాలను అందించింది. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌ క్యాప్‌ ఫండ్ 60 శాతం రాబడిని ఇచ్చింది. మహీంద్ర మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 59 శాతం తిరిగి ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ 57 శాతం రాబడిని ఇచ్చింది.

లార్జ్ క్యాప్ ఫండ్స్ (Large cap funds) 
లార్జ్ క్యాప్ ఫండ్స్‌ అంటే, తమ పెట్టుబడిలో కనీసం 80 శాతాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్ని మిడ్‌ లేదా స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో... క్వాంట్ లార్జ్ క్యాప్ ఫండ్‌ 52 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్లూ చిప్ 47 శాతం, జేఎమ్ లార్జ్ క్యాప్ 45 శాతం, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 44 శాతం, టారస్ లార్జ్ క్యాప్ ఫండ్ 44 శాతం రాబడులు అందించాయి. 

పెట్టుబడిదార్లు ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. గత సంవత్సరాల్లో వచ్చిన రాబడి భవిష్యత్‌లోనూ కొనసాగుతుందన్న గ్యారెంటీ లేదు. గత లాభాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకూడదు, తెలివిగా వ్యవహరించాలి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది. 

Published at : 10 Apr 2024 07:14 AM (IST) Tags: SIP SBI Mutual Fund Best Mutual Fund Top Mutual Funds 2024 Quant Small Cap Fund

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !

Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!

Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!

Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!

Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!