search
×

MidCap Mutual Funds 2022: లార్జ్‌ క్యాప్‌ను బీట్‌ చేసిన మిడ్‌క్యాప్‌ ఫండ్లు - ఈ ఏడాది టాప్‌ 10 ఇవే!

MidCap Mutual Funds 2022: నష్టభయం ఎక్కువున్నా మెరుగైన రిటర్న్‌ అందిస్తే చాలు అనుకునేవారికి మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లు బెస్ట్. 2022లో లార్జ్‌క్యాప్‌తో ఇవే లాభం ఆర్జించిపెట్టాయి. అందులో టాప్‌ - 10!

FOLLOW US: 
Share:

MidCap Mutual Funds 2022: నష్టభయం ఎక్కువున్నా ఫర్వాలేదు! సుదీర్ఘ కాలం మదుపు చేస్తాను! మెరుగైన రిటర్న్‌ అందిస్తే చాలు అనుకునేవారికి మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లు బాగా నప్పుతాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఫండ్ హౌజ్‌లు పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. స్వల్ప కాలంలో హెచ్చుతగ్గులు, ఒడుదొడుకులకు లోనైనా చివరికి మంచి రాబడి అందిస్తాయివి. 2022లో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ ఫండ్లు ఎక్కువ లాభం ఆర్జించిపెట్టాయి. అందులో టాప్‌ - 10 ఇవే!

క్వాంట్‌ మిడ్‌క్యాప్ ఫండ్‌: క్వాంట్‌ కంపెనీ ఆఫర్‌ చేస్తే ఈ ఫండ్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. 2022లో రెగ్యులర్‌ ఫండ్‌ 16.64 శాతం, డైరెక్ట్‌ ఫండ్‌ 18.85 శాతం రాబడి అందించింది. బెంచ్‌ మార్క్‌ రిటర్న్‌ 5.31తో పోలిస్తే ఎంతో ఎక్కువ లాభం ఆఫర్‌ చేసింది.

మోతీలాల్‌ ఓస్వాల్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌: ఈ ఫండ్‌ 2022లో రెండో స్థానంలో నిలిచింది. రెగ్యులర్‌కేటగిరీలో 15.14 శాతం, డైరెక్ట్‌ విభాగంలో 16.46 శాతం రిటర్న్‌ అందించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌: 2022లో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మూడో స్థానంలో నిలిచింది. డైరెక్ట్‌ ఫండ్‌ 14.85 శాతం, రెగ్యులర్‌ ఫండ్‌ 14.03 శాతం రిటర్న్‌ అందించాయి. ఇదీ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌నే అనుసరిస్తుంది.

నిప్పాన్‌ ఇండియా గ్రోత్‌ ఫండ్‌: ఈ ఫండ్‌ 2022లో నాలుగో స్థానంలో నిలిచింది. డైరెక్ట్‌ కేటగిరీలో 8.11 శాతం, రెగ్యులర్‌ కేటగిరీలో 7.25 శాతం రిటర్న్‌ ఆఫర్‌ చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ఫాలో అవుతుంది.

టారస్‌ డిస్కవరీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌: 2022లో టారస్‌ డిస్కవరీ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ డైరెక్ట్‌ 7.55 శాతం, రెగ్యులర్‌ 7.20 శాతం రాబడి అందించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది.

సుందరమ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌: ఈ ఫండ్‌ 2022లో మెరుగ్గానే రాణించింది. డైరెక్ట్‌ విభాగంలో 7.49 శాతం, రెగ్యులర్‌ విభాగంలో 6.48 శాతం రిటర్న్‌ ఆఫర్‌ చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేస్తుంది.

కొటక్‌ ఎమర్జింగ్‌ ఈక్విటీ ఫండ్‌: 2022లో కొటక్‌ ఎమర్జింగ్‌ ఈక్విటీ ఫండ్‌ బెంచ్‌ మార్క్‌ కన్నా కాస్త ఎక్కువ రిటర్న్‌ ఇచ్చింది. డైరెక్ట్‌ స్కీమ్‌ 7.36 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 6.03 శాతం రాబడి ఆఫర్‌ చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ఫాలో అవుతుంది.

బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌: ఈ ఏడాది మోస్తరు రాబడి ఇచ్చింది. డైరెక్ట్‌ విభాగంలో 6.76 శాతం, రెగ్యులర్‌ విభాగంలో 5.10 శాతం రిటర్న్‌ ఇచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను అనుసరిస్తుంది.

ఎడిల్‌వీస్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌: 2022లో ఎడిల్‌వీస్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ బెంచ్‌ మార్క్‌తో పోలిస్తే తక్కువ రిటర్న్‌ అందించింది. డైరెక్ట్‌లో 6.42 శాతం, రెగ్యులర్‌లో 4.76 శాతమే రాబడి ఇచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ 5.31శాతం రిటర్న్‌ ఇవ్వడం గమనార్హం.

మిరే అసెట్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్: ఈ ఏడాది మిరే అసెట్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ మోస్తరు రిటర్నే ఆఫర్‌ చేసింది. డైరెక్ట్‌ స్కీమ్‌ 6.37 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 5.07 శాతం లాభం ఇచ్చింది. ఇది నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ను ఫాలో అవుతుంది.

నోట్‌: ఈ సమాచారం, గణాంకాలు డిసెంబర్‌ 16, 2022 నాటివి. ఏఎంఎఫ్ఐ లేదా అసోసియేషన్‌ ఆఫ్ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా ఆధారంగా సమాచారం అందిస్తున్నాం.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 17 Dec 2022 11:37 AM (IST) Tags: Mutual Funds year end 2022 Yearender 2022 midcap funds midcap mutual funds best midcap funds

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?

Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?

Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!

Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు

Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?

Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?