By: ABP Desam | Updated at : 19 Sep 2022 04:31 PM (IST)
Edited By: Arunmali
సెన్సెక్స్, నిఫ్టీ క్లోజింగ్ డేటా
Stock Market Closing Bell 19 September 2022: ఇవాళ (సోమవారం) న్యూట్రల్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, రోజు మొత్తం ఒడిదొకుల్లోనే ట్రేడయ్యాయి. మంగళవారం ప్రారంభం కానున్న యూఎస్ ఫెడ్ సమావేశం ప్రభావం ఇవాళ మన మార్కెట్‌లో అతి కొద్దిగా కనిపించింది. గ్లోబల్‌గా వీక్ సిగ్నల్స్ వస్తున్నా, మన పెట్టుబడిదారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయం కోసం వెయిట్ చేస్తుండడంతో, నారో రేంజ్‌లోనే మార్కెట్లు మూవ్ అయ్యాయి.
BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,840 పాయింట్ల వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇవాళ (సోమవారం) 93 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 58,747 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 58,487.76 వద్ద ఇంట్రా డే కనిష్టాన్ని తాకింది. 59,277.55 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 300.44 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 59,141.23 వద్ద ముగిసింది. మొత్తంగా చూస్తే, కనిష్ట స్థాయి నుంచి 650 పాయింట్లు పుంజుకుంది.
NSE Nifty
శుక్రవారం 17,530 పాయింట్ల వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 10 పాయింట్లు లేదా 0.06 శాతం లాభంతో 17,540 పాయింట్ల వద్ద ఓపెనైంది. 17,429.70 వద్ద ఇంట్రా డే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,667.20 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 91.40 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 17,622.25 వద్ద ముగిసింది.
Nifty Bank
శుక్రవారం 40,776 పాయిట్ల వద్ద ముగిసిన ఈ సూచీ, ఇవాళ 91 పాయింట్లు లేదా 0.22 శాతం నష్టంతో 40,985 పాయింట్ల వద్ద మొదలైంది. 40,509.90 వద్ద ఇంట్రా డే కనిష్ఠాన్ని తాకింది. 41,184.25 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 127.60 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 40,904.40 వద్ద ముగిసింది.
Top Gainers and Lossers
నిఫ్టీ50లోని 35 కంపెనీలు లాభాల్లో ముగియగా, 15 కంపెనీలు నష్టాల్లో క్లోజయ్యాయి. ఎం&ఎం, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్ లాభాల్లో కళకళలాడగా... టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్ నష్టాల్లో విలవిల్లాడాయి. నిప్టీ మెటల్, రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తప్ప మిగిలిన సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి.
ఈ నెల 20, 21 తేదీల్లో (మంగళవారం, బుధవారం) అమెరికా ఫెడరల్ రిజర్వ్ (యూఎస్ ఫెడ్) మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం ఉంది. వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచుతుంది, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు గురించి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుంది అన్నదానిపై ఈ రెండు రోజులు ప్రపంచ మార్కెట్ల కదలికలు ఆధారపడి ఉంటాయి. భారత కాలమానం ప్రకారం, బుధవారం అర్ధరాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడేంత వరకు, మన మార్కెట్లు సహా ప్రపంచ మార్కెట్లన్నింటిలోనూ ఊగిసలాట ఉండొచ్చు. 75 బేసిస్ పాయింట్లను అంచనా వేసిన మన మార్కెట్, దానికి అనుగుణంగా ఇప్పటికే సర్దుబాటుకు గురైంది. ఒకవేళ 100 బేసిస్ పాయింట్ల పెంపుపై నిర్ణయం వస్తే మాత్రం, మార్కెట్లు మరింత జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, పెట్టుబడిదారులు ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Shock for YCP: వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?