By: ABP Desam | Updated at : 15 Apr 2023 02:39 PM (IST)
మ్యూచువల్ ఫండ్స్ కోరి మరీ కొన్న స్టాక్స్
Hot Stocks: 2023 మార్చి నెలలో, ఇండియన్ స్టాక్స్ మార్కెట్లలోకి మ్యూచువల్ ఫండ్స్ రూ. 20,700 కోట్లు చొప్పించగా, FIIలు మరో రూ. 13,100 కోట్ల కొనుగోళ్లు చేశారు. ఆ నెలలో మ్యూచువల్ ఫండ్స్ కొన్న షేర్లలో... అదానీ పవర్, అదానీ విల్మార్, డేటా ప్యాటర్న్స్, డివ్‌గీ టార్క్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ కీలకమైనవి.
మార్చిలో మ్యూచువల్ ఫండ్స్ కొన్న కొత్త స్టాక్స్ జాబితా:
HDFC MF
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచవల్ ఫండ్ కొత్తగా కొన్న స్టాక్ రెడ్ టేప్. మార్చిలో కంపెనీకి చెందిన 56,04,000 షేర్లను కొనుగోలు చేసింది. క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్, ఇంగర్‌సోల్-రాండ్, BLS ఇంటర్నేషనల్ దీని ఇతర కొత్త పెట్టుబడులు.
ICICI MF
డివ్‌గీ టోర్క్‌ట్రాన్స్‌ఫర్‌ను ఈ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో 10,90,000 షేర్లను దక్కించుకుంది. అశోకా బిల్డ్‌కాన్, ఆర్తి ఇండస్ట్రీస్, అపార్ ఇండస్ట్రీస్ దీని కొత్త టాప్ హోల్డింగ్స్.
కోటక్ MF
డేటా ప్యాటర్న్స్ మీద కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బెట్ కట్టింది, 2,87,000 షేర్లను కొనుగోలు చేసింది. ఈ షేర్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1,667, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 9,333 కోట్లు.
SBI MF
SBI మ్యూచువల్ ఫండ్ కొత్త పందెం అపార్ ఇండస్ట్రీస్. మార్చి నెలలో 3,000 షేర్లను కొనుగోలు చేసింది. ఈ ఫండ్ కొత్త పెట్టుబడుల్లో డేటా ప్యాటర్న్స్, KSB, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఉన్నాయి.
DSP MF
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్‌ను DSP మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొన్నది. మార్చిలో 24,84,000 షేర్లను దక్కించుకుంది. పవర్ గ్రిడ్ ఇన్‌విట్, వరుణ్ బెవరేజెస్, సెయిల్ వంటివి ఇతర టాప్ ఇన్వెస్ట్‌మెంట్స్.
యాక్సిస్ MF
గ్లాక్సోస్మిత్ ఫార్మా మీద యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్త పందెం కట్టింది, ఈ కంపెనీకి చెందిన 42,000 షేర్లను కొనుగోలు చేసింది. ఇతర కొత్త పెట్టుబడులు వరుణ్ బెవరేజెస్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్, సుజ్లాన్ ఎనర్జీ.
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ MF
గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్‌ను ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా కొనుగోలు చేసింది. మార్చిలో ఈ కంపెనీలో 16,35,000 షేర్లను పోర్ట్‌ఫోలియోలోకి తెచ్చుకుంది. మహీంద్ర CIE ఆటోమోటివ్, సఫైర్ ఫుడ్స్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇతర అగ్ర కొత్త పెట్టుబడులు,
ఎడెల్‌వీస్ MF
దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ను ఎడెల్‌వీస్ కొత్తగా యాడ్ చేసుకుంది, మార్చిలో 2,54,000 షేర్లను కొనుగోలు చేసింది. దీని కొత్త టాప్ ఇన్వెస్ట్‌మెంట్లలో అదానీ పవర్, KSB, ఇంగర్‌సోల్-రాండ్ ఉన్నాయి.
టాటా MF
టాటా మ్యూచువల్ ఫండ్ కొత్త పెద్ద పందెం RHI మాగ్నెసిటా. ఈ కంపెనీలో 1,68,000 షేర్లను ఫండ్ హౌస్ కొనుగోలు చేసింది. దాని ఇతర టాప్ కొత్త పెట్టుబడులలో M&M ఫైనాన్స్, హింద్ కాపర్, ఆఫ్లే ఉన్నాయి.
UTI MF
UTI మ్యూచువల్ ఫండ్ టాప్ న్యూ బెట్ అదానీ విల్మార్. మార్చి నెలలో ఈ కంపెనీకి చెందిన 1,80,000 షేర్లను కొనుగోలు చేసింది. దీని టాప్ కొత్త పెట్టుబడుల్లో నేషనల్ అల్యూమినియం కూడా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni : చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?