By: ABP Desam | Updated at : 24 Sep 2022 12:51 PM (IST)
Edited By: Arunmali
BSE500లోని 345 షేర్లు విలవిల
Can Fin Homes - M&M Fin: యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో, శుక్రవారంతో ముగిసిన వారంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు భారీ కోతలు కనిపించాయి.
వారం మొత్తంలో, బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ50 తలో ఒక శాతానికి పైగా పడిపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2 శాతం పడిపోయాయి. BSE500 ఇండెక్స్ కూడా ఒక శాతానికి పైగా తగ్గింది.
సెక్టోరియల్ పెర్ఫార్మెన్స్
సెక్టార్ల వారీగా చూస్తే... పవర్, యుటిలిటీస్, ఐటీ ఇండెక్స్‌లు ఒక్కొక్కటి 5 శాతం పడిపోయాయి. రియాల్టీ, పీఎస్‌యు సూచీలు 4 శాతం క్షీణించాయి. వీటికి విరుద్ధంగా, FMCG ఇండెక్స్ 4 శాతం పెరిగింది. హెల్త్‌కేర్, ఆటో, కన్స్యూమర్ స్టాక్స్ కూడా కొంతమేర లాభాలను నమోదు చేశాయి.
BSE500 ఇండెక్స్‌లోని 345 పేర్లు ఈ వారంలో నష్టాలను మూటగట్టుకున్నాయి. మిగిలిన 155 స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. వారం మొత్తంలో, కేవలం 8 కౌంటర్లు మాత్రమే 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగాయి. ఇదే సంఖ్యలోని స్టాక్స్ రెండంకెల కోతను అనుభవించాయి.
టాప్ లూజర్ కాన్ ఫిన్ హోమ్స్
అత్యధికంగా నష్టపోయిన కంపెనీల్లో కాన్ ఫిన్ హోమ్స్‌ది అగ్ర స్థానం. ఇది 19 శాతం క్షీణించి రూ.517.30కి చేరుకుంది. కంపెనీ CEO గిరీష్ కౌస్గి రాజీనామాతో ఈ పతనం కనిపించింది.
రుణాల రికవరీలో వేధింపుల మీద ఆర్‌బీఐ కన్నెర్ర జేయడంతో, మహీంద్ర & మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ 14 శాతం పైగా పడిపోయి రూ.194.45కి చేరుకుంది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 14 శాతం, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ 12 శాతం క్షీణించాయి. PCBL, ఫోర్టిస్ హెల్త్‌కేర్, MRPL కూడా వారంలో 10-12 శాతం వరకు పతనమయ్యాయి.
KBC గ్లోబల్, సింధు ట్రేడ్ లింక్స్, వినైల్ కెమికల్స్ (ఇండియా), ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ సహా స్మాల్ క్యాప్ కౌంటర్లు ఈ వారంలో 18-23 శాతం మధ్య దిగివచ్చాయి.
టాప్ గెయినర్ డిష్ టీవీ
గెయినర్స్ విషయానికి వస్తే... డిష్ టీవీ ఇండియా 24 శాతం పెరిగి రూ.18.90కి చేరుకుంది. శ్రీ రేణుక షుగర్ 18 శాతం ర్యాలీ చేసి 57.60కి చేరుకుంది.
స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ 16 శాతం పుంజుకుని రూ.337.30 వద్ద ఉంది.
KPIT టెక్నాలజీస్ 15 శాతం జంప్ చేసి రూ.660.40కి చేరుకుంది. మెటల్ సంస్థ వెల్స్పన్ కార్ప్ ఈ వారంలో 13 శాతం పురోగమించింది. మెట్రో బ్రాండ్స్, జేఎం ఫైనాన్షియల్, కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కొచ్చిన్ షిప్‌యార్డ్ కూడా 11-13 శాతం మధ్య లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?