search
×

Fineotex Chemicals: రెండు నెలల్లో రెట్టింపైన ఆశిష్‌ కచోలియా ఫేవరెట్‌ స్టాక్‌

జులై 14 నాటి రూ.202.95 స్థాయి నుంచి ఇప్పటివరకు పెరిగి, పెరిగి డబుల్‌ సైజ్‌లోకి వచ్చింది.

FOLLOW US: 

Ashish Kacholia Fineotex Chemicals: బలమైన బిజినెస్‌ ఔట్‌లుక్‌తో, ఇవాళ్టి (మంగళవారం) ఇంట్రా డే ట్రేడ్‌లో ఫినియోటెక్స్ కెమికల్స్ ‍‌(Fineotex Chemicals) షేర్లు ఉత్తర దిశలో కదిలాయి, ఉదయం 10:25 గంటల సమయంలో రూ.409.45 వద్దకు చేరి కొత్త గరిష్టాన్ని తాకాయి. అయితే, అక్కడి నుంచి నెమ్మదిగా దక్షిణ దిక్కుగా నడిచిన షేర్లు, మధ్యాహ్నం 1.45 గంటల సమయం నుంచి ఒక్కసారిగా కిందకు జారిపోయాయి. దీంతో, ఇవాళ్టి 9 శాతం లాభం మొత్తం ఆవిరైంది, రికార్డ్‌ మాత్రం మిగిలింది.

గత రెండు నెలల్లో చూస్తే, ఈ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ షేరు ధర రెట్టింపైంది. జులై 14 నాటి రూ.202.95 స్థాయి నుంచి ఇప్పటివరకు పెరిగి, పెరిగి డబుల్‌ సైజ్‌లోకి వచ్చింది.

జూన్ (Q1FY23) త్రైమాసికంలో బలమైన నంబర్లను పోస్ట్‌ చేసిన తర్వాత స్టాక్‌ యాక్షన్‌లో పూర్తి ఛేంజ్‌ కనిపించింది. ఫలితాల తర్వాత గత నెల రోజుల్లోనే ఇది 57 శాతం పెరిగింది. దీనితో పోల్చితే, ఇదే కాలంలో BSE సెన్సెక్స్ 1.7 శాతం పెరిగింది. గత మూడు నెలలను పరిగణనలోకి తీసుకుంటే, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 14 శాతం లాభంతో పోలిస్తే, ఈ స్టాక్ ఏకంగా 156 శాతం జూమ్ అయింది.

సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియాకు (Ashish Kacholia) ఈ కెమికల్‌ స్టాక్‌లో పెట్టుబడులు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 30 నాటికి, ఫినోటెక్స్ కెమికల్స్‌లో 2.14 మిలియన్ ఈక్విటీ షేర్లు లేదా 1.93 శాతం వాటాను ఆయన కలిగి ఉన్నారు. 

టెక్స్‌టైల్ కెమికల్స్, యాక్సిలరీస్, స్పెషాలిటీ కెమికల్స్ తయారీ వ్యాపారాన్ని ఫినోటెక్స్ కెమికల్స్ చేస్తోంది. టెక్స్‌టైల్ పరిశ్రమకు ఈ సంస్థకు అతి పెద్ద క్లయింట్‌. పెద్ద బ్రాండెడ్‌ టెక్స్‌టైల్స్‌ ఈ కంపెనీకి స్థిరమైన, విశ్వసనీయ కస్టమర్లు. ఉత్పత్తి నాణ్యతకు బ్రాండ్ రీకాల్‌ ఉంది. టెక్స్‌టైల్ కెమికల్స్ ఎగుమతి పోర్ట్‌ఫోలియోలో 60కి పైగా దేశాలు ఉన్నాయి.

టెక్నికల్‌ వ్యూ 
బయాస్‌: పాజిటివ్‌
సపోర్ట్‌: రూ.358
టార్గెట్‌: రూ.420, ఆ తర్వాత రూ.450

డైలీ ఛార్ట్‌ ప్రకారం.. బొలింజర్‌ బ్యాండ్‌ హయ్యర్‌ ఎండ్‌కు సమీపంలో ఈ స్టాక్‌ ధర కదులుతోంది. వీక్లీ ఛార్ట్‌ ప్రకారం.. బొలింజర్‌ బ్యాండ్‌ హయ్యర్‌ ఎండ్‌ పైన ట్రేడవుతోంది.

కీలక మొమెంటం ఓసిలేటర్లు MACD, డైరెక్షనల్‌ ఇండెక్స్‌, స్లో స్టోకాస్టిక్ అటు డైలీ ఛార్ట్‌లో, ఇటు వీక్లీ ఛార్ట్‌లో బుల్స్‌కు చాలా అనుకూలంగా ఉన్నాయి.

వీక్లీ ఛార్ట్‌ ప్రకారం... ఈ స్టాక్‌ రూ.358 పైన కొనసాగినంత కాలం ఓవరాల్‌ బయాస్‌ బుల్లిష్‌గా ఉంటుంది. ఈ మార్క్‌ కంటే కిందకు దిగితే వ్యూ మార్చుకోవాలి. 

అప్‌సైడ్‌లో, మంత్లీ ఫిబొనాసీ ఛార్ట్‌ ప్రకారం, ఎప్పటికప్పుడు కొత్త శిఖరాల కోసం వెదుకుతున్న ఈ స్టాక్‌, రూ.420 వరకు చేరుకోగలదు. ఈ స్థాయిని దాటగలిగితే తర్వాతి టార్గెట్‌ రూ.450.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 13 Sep 2022 03:27 PM (IST) Tags: Stock Market Ashish Kacholia Fineotex Chemicals Speality Chemicals