Latest Gold-Silver Prices 02 October 2024: ఇజ్రాయెల్‌ మీద ఇరాన్‌ దాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఒకేసారి 1% పైగా పెరిగింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,676 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 540 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 500 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 410 రూపాయల చొప్పున పెరిగాయి. వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 77,450 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,090 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,01,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 77,450 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,090 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 1,01,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 77,450 ₹ 71,000 ₹ 58,090 ₹ 1,01,000
విజయవాడ ₹ 77,450 ₹ 71,000 ₹ 58,090 ₹ 1,01,000
విశాఖపట్నం ₹ 77,450 ₹ 71,000 ₹ 58,090 ₹ 1,01,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)  
చెన్నై ₹ 7,100 ₹ 7,745  
ముంబయి ₹ 7,100 ₹ 7,745  
పుణె ₹ 7,100 ₹ 7,745  
దిల్లీ ₹ 7,115 ₹ 7,760  
 జైపుర్‌ ₹ 7,115 ₹ 7,760  
లఖ్‌నవూ ₹ 7,115 ₹ 7,760  
కోల్‌కతా ₹ 7,100 ₹ 7,745  
నాగ్‌పుర్‌ ₹ 7,100 ₹ 7,745  
బెంగళూరు ₹ 7,100 ₹ 7,745  
మైసూరు ₹ 7,100 ₹ 7,745  
కేరళ ₹ 7,100 ₹ 7,745  
భువనేశ్వర్‌ ₹ 7,100 ₹ 7,745  

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,839 ₹ 7,382
షార్జా ‍‌(UAE) ₹ 6,839 ₹ 7,382
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,839 ₹ 7,382
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,906 ₹ 7,353
కువైట్‌ ₹ 6,661 ₹ 7,242
మలేసియా ₹ 7,012 ₹ 7,374
సింగపూర్‌ ₹ 6,974 ₹ 7,678
అమెరికా ₹ 6,710 ₹ 7,129

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 340 పెరిగి ₹ 26,770 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది 48 లక్షల పెళ్లిళ్లు, రూ.6 లక్షల కోట్ల ఖర్చు - ముహూర్తాలు ఎప్పుడంటే?