Israel-Iran Tension Row: మంగళవారం (1 అక్టోబర్ 2024) అర్థరాత్రి ఇరాన్ చేసిన దాడికి ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పెద్ద తప్పు చేసిందని, దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. తమపై ఎవరు దాడి చేసినా ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు.


"ఇరాన్ భారీ తప్పు చేసింది, దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది" అని అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో ఒక పోస్ట్‌లో నేతన్యాహు హెచ్చరించారు. "జఫాలో జరిగిన తుచ్ఛమైన ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. క్షిపణి దాడి మాదిరిగానే ఈ ఉగ్రవాద దాడి వెనుక హంతక హస్తం ఉంది. ఇందులో టెహ్రాన్ పాత్ర ఉంది."


'ఎవరు దాడి చేసినా మేం దాడి చేస్తాం'






"ఇరాన్ పెద్ద తప్పు చేసింది. దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మమ్మల్ని మేం రక్షించుకోవడానికి, మాపై దాడి చేసినవారి గుణపాఠం నేర్పాం ఈ విషయాన్ని టెహ్రాన్‌ పాలకులకు అర్థం కావడం లేదు. 


ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడిని జపాన్‌, అమెరికా ఖండించాయి. ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేయడం సరికాదని జపాన్ కొత్త ప్రధాని షిగెరు ఇషిబా అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం, అదే టైంలో ఉద్రిక్తత తగ్గించడానికి ఘర్షణ పూరిత వాతావరణం యుద్ధంగా మారకుండా ఉండేందుకు సహకరించాలని కోరుకుంటున్నాం. 


పరిస్థితి అదుపు తప్పుతుంటే మాత్రం టెహ్రాన్ దాడికి వ్యతిరేకంగా ప్రతీకార చర్య తీసుకుంటామని అమెరికా హామీ ఇచ్చింది. చిరకాల మిత్రదేశమైన ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేస్తామని వాషింగ్టన్‌ ప్రకటించింది. 


Also Read: పశ్చిమాసియాలో మరోసారి టెన్షన్, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం- అర్థరాత్రి విధ్వంసం