Pakistani family living in India as Sharmas : బెంగళూరులో శివారులో రాజపురా విలేజ్‌లో శంకర్ శర్మ కుటుంబం నివాసం ఉంటుంది. బతుకుదెరవు కోసం ఇంజిన్ ఆయిల్ అమ్మడం, ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లు తీసుకోవడం చేస్తూంటారు. శంకర్ శర్మకు భార్య శర్మతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి పేర్లలో చివర శర్మ.  పేరేమిటి అని ఎవరైనా అడిగినప్పుడు గుర్తు చేసి మరీ తెలుసుకోవాలన్నట్లుగా శర్మ అని చెబుతూంటారు. వీళ్లకు కుల పట్టింపు కాస్త ఎక్కువేమో అని చుట్టుపక్కన వారు అనుకునేవారు. 


శర్మ పేరుతో ఆధార్ కార్డులు తీసుకున్న  పాకిస్థాన్ ఫ్యామిలీ                  


కానీ రెండు రోజుల కిందట హఠాత్తుగా పోలీసులు దాడి చేసి శంకర్ శర్మ అతని కుటుంబాన్ని పట్టుకుపోయారు. ఏం జరిగిందా అని చుట్టుపక్కల వారు ఆరా తీస్తే వాళ్లు శర్మ ఫ్యామిలీ కాదని రషీద్ అలీ సిద్దిఖీ ఫ్యామిలీ అని తేలింది. వారు పాకిస్తాన్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నారని గుర్తించారు.  దీంతో వారు హడలెత్తిపోయారు. వారు టెర్రరిస్టులేమో అనుకున్నారు.కానీ పోలీసులు మాత్రం బయపడవద్దని..వారు టెర్రరిస్టులు కాదని అక్రమంగా నివాసం ఉంటున్నందున అరెస్టు చేసి తీసుకెళ్లామని సర్ది చెప్పారు. శంకర్ శర్మ అలియాస రషీద్ సిద్దికీ ఫ్యామిలీకి  ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి.


పాకిస్థాన్‌లోని మెహదీ ఫౌండేషన్ సభ్యులు                               


రషీద్ అలీ పాకిస్తాన్ లోని మెహదీ ఫౌండేషన్ ఇంటర్నేషన్ అనే గ్రూపునకు చెందిన వారు. పర్వేజ్ ముషారఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సంస్థ పాకిస్థాన్ యాక్టివ్ గా పని చేసింది. ముషారఫ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని నిషేధం విధించారు. దీంతో చాలా మంది బంగ్లాదేశ్, ఇండియాలకు ఆ సంస్థ సభ్యులు పారిపోయారు. ఇండియాకు వచ్చిన వారిని భారత ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇచ్చింది.ఈ సంస్థపై నిషేధాన్ని ముషారఫ్ ప్రభుత్వం విధించిన తర్వాత వారంతా పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు ఆందోళన చేశారు. తమ తమ పాస్ పోర్టులన్నీ కాల్చివేశారు. తర్వాత వారికి యూకే, అమెరికా వంటి దేశాలు శరణార్ధులుగా అంగీకరించడంతో.. ఆయా దేశాలకు పంపించి వేశారు. 


తీవ్ర వాద వ్యవహారాలతో సంంబధం లేదన్న ఎంఎఫ్ఐ సభ్యులు                     


కానీ కొంత మంది అలా వెళ్లకుండా ఇండియాలోనే రహస్యంగా ఉండిపోయారు. అక్రమ పద్దతుల్లో భారత ఆధార్ కార్డులు.. ఇతర గుర్తింపు కార్డులు తెచ్చుకుని హిందువులాగా చెలామణి అవుతున్నారు. మెహదీ ఫౌండేషన్ సభ్యులు ఎలాంటి గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం లేదని కానీ అక్రమంగా దేశంలో ఉంటున్నందున అరెస్టు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.