Affordable AMT Cars In India In 2025: సిటీల్లో ట్రాఫిక్‌ సమస్యల గురించి తెలియండి కాదు. కిలోమీటర్‌ ముందుకు కదలాలంటే గంట టైమ్‌ పట్టే రోజులు ఇవి. అలాంటి ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో కష్టంగా అనిపిస్తుంది, చిరాకు వస్తుంది. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్‌ అయితే ట్రాఫిక్‌లోనూ పెద్దగా చిరాకు పెట్టదు. 2025లో.. మైలేజ్‌, ఫీచర్స్, సేఫ్టీ వంటి అంశాల ఆధారంగా, రూ. 8 లక్షలలో కొనగలిగే ఆటోమేటిక్ (AMT/AGS) కార్లలో అత్యంత విజయవంతమైన ఐదు మోడల్స్‌ ఇవి:

1. Maruti Suzuki Alto K10 AMT

  • ధర: రూ. 5.60 లక్షలు (VXi AMT) & రూ. 6.10 లక్షలు (VXi+ AMT)
  • ఇంజిన్: 998 cc పెట్రోల్‌, 66 bhp పవర్‌, 89 Nm టార్క్‌
  • ట్యాన్స్‌మిషన్: 5‑స్పీడ్ AMT
  • ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌: 24.9 kmpl; వాస్తవ మైలేజ్‌ 18–20 kmpl
  • బూట్ స్పేస్: 214 లీటర్లు
  • సేఫ్టీ & ఫీచర్స్: 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ABS/EBD, ఐడల్‌ స్టార్ట్-స్టాప్‌, డిజిటల్ క్లస్టర్, ఎలక్ట్రిక్ ORVMs
  • వాల్యూ: అతి తక్కువ ధరలో సిటీలో తిరగడానికి మంచి ఎంపిక

2. Renault Kwid AMT

  • ధర: రూ. 5.45 - రూ. 5.85 లక్షలు
  • ఇంజిన్: 1.0L SCe, 68 bhp పవర్‌, 91 Nm టార్క్‌
  • AMT: 5‑స్పీడ్ Easy‑R
  • మైలేజ్‌: 22 kmpl (ARAI); వాస్తవ మైలేజ్‌ 17–18 kmpl
  • ఇంటీరియర్ & ఫీచర్స్: 8 అంగుళాల టచ్ స్క్రీన్, LED DRLs, ఆండ్రాయిడ్‌ ఆటో/ఆపిల్‌ కార్‌ ప్లే
  • స్పెషాలిటీ: SUV తరహా డిజైన్, టెక్‑సేఫ్టీ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటుంది

3. Maruti Suzuki S‑Presso AMT

  • ధర: రూ. 5.40 - రూ. 6.00 లక్షలు
  • ఇంజిన్: 1.0L K10C, 66 bhp పవర్‌, 89 Nm టార్క్‌
  • మైలేజ్‌: 25.3 kmpl; వాస్తవ మైలేజ్‌ 20–21 kmpl
  • బూట్ స్పేస్: 270 లీటర్లు
  • ఫీచర్స్: 180 mm గ్రౌండ్ క్లియరెన్స్, రెండు ఎయిర్‌బ్యాగులు, ABS/EBD, రివర్స్ సెన్సార్
  • స్పెషాలిటీ: టాల్‌ రోడ్ వ్యూ, సిటీ కంఫర్ట్‌ కోసం ఇదొక స్టయిలిష్ ఆప్షన్‌

4. Tata Tiago AMT

  • ధర: రూ. 6.89 లక్షలు (XTA) & రూ. 7.54 లక్షలు (XZA)
  • ఇంజిన్: 1.2L Revotron, 86 bhp పవర్‌, 113 Nm టార్క్‌
  • మైలేజ్‌: దాదాపు 19 kmpl; వాస్తవ మైలేజ్‌ 16–18 kmpl
  • సేఫ్టీ & ఫీచర్స్: 4‑star గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, రెండు ఎయిర్‌బ్యాగులు, ఆండ్రాయిడ్‌ ఆటో/ఆపిల్‌ కార్‌ ప్లే, హార్మన్‌ ఆడియో
  • స్పెషాలిటీ: బలమైన బాడీ, features‑పరంగా ఆదర్శవంతమైన నిర్మాణం

5. Hyundai Grand i10 Nios AMT

  • ధర: రూ. 6.70 - రూ. 7.85 లక్షలు (Sportz AMT దాదాపు రూ. 7.30 లక్షలు)
  • ఇంజిన్: 1.2L పెట్రోల్‌, స్మార్ట్‌ ఆటో AMT
  • మైలేజ్‌: 20.7 kmpl
  • ఫీచర్స్: 8 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్‌ ఛార్జర్‌, రియర్‌ AC వెంట్స్‌, రియర్‌ కెమెరా
  • స్పెషాలిటీ: అప్‌డేటెడ్‌ సస్పెన్షన్‌, ప్రీమియం ఇంటీరియర్‌ ఫినిషింగ్‌

మీ నగరాల్లో ట్రాఫిక్ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, క్లచ్‌ నుంచి విముక్తి పొంది మరింత రిలాక్స్‌డ్‌గా సిటీలో డ్రైవ్ చేయడానికి ఈ AMT వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది.