Trinayani Serial Today Episode సుమన తన కూతురు ఉలూచిని పెద్దబొట్టమ్మకు దానం ఇచ్చేస్తుంటే గాయత్రీ పాప వచ్చి అడ్డుకుంటుంది. నయని దగ్గరకు వెళ్లి ఫోన్ ఇస్తుంది. ఆ ఫోన్‌లో వీడియో చూసి నయని షాక్ అవుతుంది. పాపని సుమన ఇవ్వబోతే నయని ఆపి పాపని తీసుకోమని విక్రాంత్‌కి చెప్తుంది. 


విక్రాంత్: నేను తండ్రిని కాదని సుమన తేల్చేశాక పాపని తీసుకొని నేనే ఏం చేస్తా వదినా.
నయని: నేను తీసుకోమన్నా విక్రాంత్ బాబు.
సుమన: నేను ఇవ్వను.
విక్రాంత్: సుమన ఇవ్వు అని విక్రాంత్ బలవంతంగా పాపని తీసుకుంటే నయని సుమన చెంపలు వాయించి చితక్కొడుతుంది. గాయత్రీ పాప తీసుకొచ్చిన ఫోన్లో వీళ్లిద్దరి బండారం బయట పడింది చూడండి అని మొత్తం వీడియో చూపిస్తుంది. 
తిలోత్తమ: ఎవరికి వాళ్లు ఎంత పెద్ద స్కెచ్ వేశారో.
హాసిని: అమ్మనా పెద్ద బొట్టమ్మ మా అమ్మలా మంచి మనసు ఉంటుందనుకున్నా కానీ సుమనకు ఇలా చెప్పి పసి బిడ్డని ఎత్తుకుపోవాలి అనుకోవడానికి సిగ్గు లేదా నీకు.
దురంధర: అది కాటేసినా పర్లేదు కానీ రెండు దెబ్బలు తగిలించడండి.
నయని: ముందు ఇక్కడి నుంచి వెళ్లు.. 


రాత్రి దురంధర, తిలోత్తమ మాట్లాడుకుంటుంటే హాసిని గాయత్రీ పాపని తీసుకొని వస్తుంది. ఇంతలో విశాల్ వస్తాడు. అందరూ విశాల్‌కు జరిగింది చెప్తారు. పెద్దబొట్టమ్మ, సుమన ప్లాన్‌లను గాయత్రీ పాప తీసిన వీడియో గురించి చెప్తారు. చిన్న పిల్లకు ఇన్ని తెలివి తేటలు ఎలా వచ్చాయో అని అర్థం కావడం లేదని తిలోత్తమ  అంటుంది. ఇక విశాల్ ఏదో ఫైల్ భాస్కర్‌కి ఇస్తానని అరగంటలో వస్తానని చెప్పి వెళ్తాడు. మరోవైపు సుమనకు విక్రాంత్ తిడతాడు. భుజంగమణి కోసం ఇంత దారుణానికి ఓడిగడతావా అని అంటుంది. ఇంకోసారి ఇలా చేస్తే ఉలూచిని కూడా నయని వదినకు దత్తత ఇచ్చేస్తా అని అంటాడు. 


ఇక సుమన ఉలూచిని పట్టించుకోకపోతే దురంధర ఏడుస్తున్న పాపని తీసుకొచ్చి హాల్‌లో ఆడుకుంటున్న గాయత్రీ పాప దగ్గర సుమనను పెట్టి పావనా ఫోన్ చేయడంతో మాట్లాడటానికి వెళ్తుంది. ఇంతలో పెద్దబొట్టమ్మ పిల్లల తప్ప హాల్‌లో ఇంకెవరూ లేరు ఉలూచిని తీసుకొని వెళ్లిపోతానను కుంటుంది. పెద్దబొట్టమ్మ ఉలూచిని తీసుకునే టైంలో హాసిని వచ్చి ఉలూచిని తీసుకొంటుంది. ఇక నయని, దురంధరలు కూడా అక్కడికి వస్తారు. గాయత్రీ పాప నయని చేయి పట్టుకొని పెద్దబొట్టమ్మ దాక్కోవడాన్ని చూపించేస్తుంది. అప్పుడే కిందకి వచ్చిన తిలోత్తమ, వల్లభలు పెద్దబొట్టమ్మని చూస్తారు. పెద్దబొట్టమ్మ దండం పెట్టడంతో తిలోత్తమ అబద్ధం చెప్తుంది.


భుజంగమణి కోసం సాయం చేస్తే చెప్పనని అంటుంది తిలోత్తమ  పెద్దబొట్టమ్మ సరే అంటుంది. ఇక పాప మాత్రం పెద్దబొట్టమ్మ వైపే చేయి చూపిస్తుంది. కింద పడుకొని మరీ చూపిస్తుంది. విక్రాంత్ వెళ్తే వల్లభ అడ్డుకుంటాడు. దాంతో దురంధర నువ్వే వెళ్లి చూపించని పాపని పంపుతుంది. గాయత్రీ పాప పెద్ద బొట్టమ్మ వైపు వెళ్తుంది. ఇక పాప ఏం చూపిస్తుందో చూడటానికి పెద్దబొట్టమ్మ పాములా మారిపోతుంది. గాయత్రీ పాప టేబుల్ కింద చేయి పెట్టింది అక్కడ భుజంగమణి ఉందని గ్రహించిన పెద్దబొట్టమ్మ పాము దాన్ని తీసుకోవాలి అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే పాప భుజంగమణి తీసుకోవడంతో పెద్దబొట్టమ్మ పాము పాపని కాటేస్తుంది. పాప నోట్లోనుంచి నురగ రావడం చూసిన విక్రాంత్ పెద్దగా అరుస్తాడు. పాము కాటేసిందని అందరూ షాక్ అయిపోతారు. ఆ పాముని చూసిన నయని పెద్దబొట్టమ్మే కాటేసిందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: తల్లిని గుడిలో చూసేసిన విహారి.. మొదలైన తులాభారం, సహస్ర ప్రేమ గెలుస్తుందా?