search
×

Tamilnad Mercantile Bank IPO: వందేళ్ల చరిత్ర ఉన్న బ్యాంక్‌ IPO ఇవాళ ప్రారంభం, మీకు లాంగ్‌టర్మ్‌ వ్యూ ఉంటే బిడ్‌ వేయొచ్చు!

ఇవన్నీ కంప్లీట్‌గా ఫ్రెష్‌ షేర్లు. ప్రమోటర్లు గానీ, ప్రస్తుత షేర్‌హోల్డర్లు గానీ ఒక్క వాటాను కూడా అమ్మకానికి పెట్టలేదు కాబట్టి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) లేదు.

FOLLOW US: 
Share:

Tamilnad Mercantile Bank IPO: మన దేశంలో వందేళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేట్ రంగ బ్యాంక్‌ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (Tamilnad Mercantile Bank - TMB) IPO ఇవాళ ప్రారంభమైంది. గత మూడు వారాల్లో మార్కెట్‌లోకి వచ్చిన మూడో ఐపీవో ఇది. ఇంతకుముందు వచ్చిన సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీ, డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ ఐపీవోలకు పెట్టుబడిదారుల నుంచి బలమైన రెస్పాన్స్‌ వచ్చింది. డ్రీమ్‌ఫోక్స్ సర్వీసెస్ మంగళవారం లిస్ట్‌ కాబోతోంది. తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు షేర్లు ప్రస్తుతం 7 శాతం గ్రే మార్కెట్‌ ప్రీమియంతో (GMP) చేతులు మారుతున్నాయి. TMB IPOకు సంబంధించిన పూర్తి వివరాలు:

ఐపీవో తేదీలు:
ఇవాళ (సోమవారం) ప్రారంభమైన ఐపీవో 7న (బుధవారం) ముగుస్తుంది.

ప్రైస్ బ్యాండ్‌:
IPO కోసం ఒక్కో షేరుకు రూ.500 - 525 ధరను తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇవన్నీ కంప్లీట్‌గా ఫ్రెష్‌ షేర్లు. ప్రమోటర్లు గానీ, ప్రస్తుత షేర్‌హోల్డర్లు గానీ ఒక్క వాటాను కూడా అమ్మకానికి పెట్టలేదు కాబట్టి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) లేదు. ఐపీవో ద్వారా వచ్చే ప్రతి రూపాయి కంపెనీకే వెళ్తుంది. 

లాట్‌ సైజ్‌: 
ఐపీవోలో, 28 షేర్లను ఒక్కో లాట్‌గా నిర్ణయించారు. బిడ్‌ వేయాలనుకున్నవాళ్లు 28 చొప్పున షేర్లకు బిడ్లు వేయాలి. ఒక్కో లాట్‌ విలువ రూ.14,000 - 14,700.

కంపెనీ ఆర్థిక స్థితి:
యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రకారం... తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నికర లాభం 2020 మార్చి - 2022 మార్చి మధ్య దాదాపు 42 శాతం CAGR వద్ద పెరిగింది. ఈ కాలంలో, డిపాజిట్లు 10.5 శాతం CAGR వద్ద వృద్ధి చెందాయి. అడ్వాన్సులు 9.9 శాతం పెరిగాయి.

జీఎంపీ (గ్రే మార్కెట్‌ ప్రీమియం - సోమవారం):
మార్కెట్ ఎనలిస్టుల లెక్కల ప్రకారం.. ఇవాళ గ్రే మార్కెట్‌లో 7 శాతం ప్రీమియం వద్ద షేర్లు చేతులు మారుతున్నాయి.

కంపెనీ పూర్వపరాలు:
నాడార్ బ్యాంక్‌ పేరిట 1921లో దీనిని స్థాపించారు, ప్రారంభమై ఇప్పటికి 101 సంవత్సరాలైంది. ప్రాథమికంగా.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయం, రిటైల్ కస్టమర్లకు లోన్లు ఇస్తోంది. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 509 శాఖలు ఉన్నాయి. వాటిలో, సొంత రాష్ట్రమైన తమిళనాడులో 369 బ్రాంచ్‌లు ఉన్నాయి. బ్యాంక్‌ మొత్తం ఆదాయంలో ఈ 369 శాఖల నుంచే 70 శాతం వస్తోంది. 15 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మిగిలిన శాఖలు విస్తరించి ఉన్నాయి.

బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్:
కంపెనీ షేర్లు ఈ నెల 15న (గురువారం) రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE, NSE‌) లిస్ట్ అవుతాయని భావిస్తున్నారు. 

వాల్యుయేషన్‌:
ప్రైస్‌ బ్యాండ్‌ అప్పర్‌ రేంజ్‌ ప్రకారం... ఐపీవో విలువను దాని పోస్ట్‌ ఐపీవో బుక్‌ వాల్యూకు 1.35 రెట్ల వద్ద నిర్ణయించారు. 

ఐపీవోలో బిడ్‌ వేయాలా?:
బ్యాంక్‌కు ఉన్న సుదీర్ఘ అనుభవం, విశ్వసనీయ కస్టమర్ బేస్, సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం, తమిళనాడులో బలమైన ఉనికి, స్థిరంగా పెరుగుతున్న డిపాజిట్ బేస్ కారణంగా ఈ ఇష్యూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని, దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాలని రీసెర్చ్‌ హౌస్‌ 'అజ్‌కాన్‌ గ్లోబల్‌' (Ajcon Global) సిఫార్సు చేస్తోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 05 Sep 2022 10:07 AM (IST) Tags: IPO GMP Share Market Tamilnad Mercantile Bank

ఇవి కూడా చూడండి

NTPC Green IPO: రూ.10 వేల కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో, 4 బ్యాంక్‌లు ఎంపిక

NTPC Green IPO: రూ.10 వేల కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో, 4 బ్యాంక్‌లు ఎంపిక

Bharti Hexacom: భారతి హెక్సాకామ్ బంపర్ లిస్టింగ్, ఇన్వెస్టర్లకు లాభాల పంట

Bharti Hexacom: భారతి హెక్సాకామ్ బంపర్ లిస్టింగ్, ఇన్వెస్టర్లకు లాభాల పంట

Bharti Hexacom: రెండ్రోజుల్లో భారతి హెక్సాకామ్ IPO లిస్టింగ్‌, GMP పరిస్థితి ఏంటి?

Bharti Hexacom: రెండ్రోజుల్లో భారతి హెక్సాకామ్ IPO లిస్టింగ్‌, GMP పరిస్థితి ఏంటి?

Vishal Mega Mart: భారీ ఐపీవో కోసం ముమ్మర సన్నాహాలు, చర్చలు స్టార్ట్‌ చేసిన కంపెనీ

Vishal Mega Mart: భారీ ఐపీవో కోసం ముమ్మర సన్నాహాలు, చర్చలు స్టార్ట్‌ చేసిన కంపెనీ

IPO: రూ.5,000 కోట్ల ఐపీవో, సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌, గేట్లు ఎత్తడమే ఇక మిగిలింది!

IPO: రూ.5,000 కోట్ల ఐపీవో, సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌, గేట్లు ఎత్తడమే ఇక మిగిలింది!

టాప్ స్టోరీస్

Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు

Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు

Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత

Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత

Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?

Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?

T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్

T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్