By: Arun Kumar Veera | Updated at : 14 Apr 2024 09:14 AM (IST)
రూ.10 వేల కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో
NTPC Green Energy IPO: ప్రస్తుతం, భారతీయ స్టాక్ మార్కెట్లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (IPOs) ఒకదాని తర్వాత ఒకటి స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాయి. పెద్ద, చిన్న కంపెనీలు ప్రైమరీ మార్కెట్ డోర్ బెల్ కొడుతున్నాయి. మార్కెట్‌లోకి ఏ కంపెనీ వచ్చినా.. పెద్ద, చిన్న తేడా చూపకుండా పెట్టుబడిదార్లు ప్రేమను కురిపిస్తున్నారు. ఇప్పుడు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా IPO ప్రవాహంలోకి దిగుతోంది. సుమారు 10 వేల కోట్ల రూపాయల విలువైన IPOతో ప్రైమరీ మార్కెట్ ముందుకు రాబోతోంది.
2022లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) IPO తర్వాత, ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రారంభిస్తున్న అతి పెద్ద ఇష్యూ ఇదే. ఈ IPO ద్వారా వచ్చే డబ్బును సౌర శక్తి, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి వాటిలో పెట్టుబడులకు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఉపయోగిస్తుంది. ఈ భారీ IPOను నిర్వహించడానికి 4 పెట్టుబడి బ్యాంకులను కూడా కంపెనీ ఎంపిక చేసింది.
క్యూలో నిలబడ్డ 12 ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు
మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, దాదాపు 12 ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఆఫర్ పట్ల ఆసక్తి కనబరిచాయి. వాటి నుంచి.. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్‌ను ఎన్‌టీపీసీ గ్రీన్ ఎంచుకున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గోల్డ్‌మన్ సాక్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డామ్ క్యాపిటల్ వంటి పెద్ద పెట్టుబడి బ్యాంకులు కూడా ఈ రేసులో పాల్గొన్నాయి.
ఎన్‌టీపీసీ గ్రీన్ అనేది NTPC అనుబంధ సంస్థ. 2022 ఏప్రిల్‌లో ఈ కంపెనీని ఎన్‌టీపీసీ ఏర్పాటు చేసింది. దీనినిలో పూర్తి వాటా, అంటే 100 శాతం యాజమాన్య వాటా ఎన్‌టీపీసీదే. గతంలో, ఈ అనుబంధ సంస్థలో 20 శాతం వాటాను ఒక పెద్ద పెట్టుబడిదారుకు ఇవ్వడానికి ఎన్‌టీపీసీ ప్రయత్నించింది. మలేషియాకు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ పెట్రోనాస్ ఈ వాటా కోసం సుమారు 460 మిలియన్ డాలర్లను ఆఫర్ చేసింది. అయితే, వాటాను విక్రయించకూడదని ఆ తర్వాత ఎన్‌టీపీసీ నిర్ణయించుకుంది.
25 గిగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ CEO మోహిత్ భార్గవ ఇటీవల CNBC TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కంపెనీ IPO 2025 ఆర్థిక సంవత్సరంలో వస్తుందని చెప్పారు. ఎన్‌టీపీసీ గ్రీన్ ప్రస్తుతం 8 గిగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌తో పని చేస్తోందని అన్నారు. దీనిని 25 గిగావాట్లకు పెంచాల్సి ఉందన్నారు. ఈ విస్తరణకు అవసరమైన మూలధనం కోసం వీలైనంత త్వరగా ఐపీఓ తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.
అతి పెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్‌ఐసీ, 2022 మే నెలలో రూ. 21 వేల కోట్ల భారీ ఐపీవోను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత, 2023 నవంబర్‌లో IREDA రూ. 2150 కోట్ల IPOను లాంచ్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: హమ్మయ్య, 5 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం - కలవరపెడుతున్న ఆ ఒక్క విషయం
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Allu Arjun Bail : అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!