By: Arun Kumar Veera | Updated at : 10 Apr 2024 07:45 AM (IST)
రెండ్రోజుల్లో భారతి హెక్సాకామ్ IPO లిస్టింగ్
Bharti Hexacom IPO News: భారతి ఎయిర్‌టెల్ అనుబంధ సంస్థ అయిన భారతి హెక్సాకామ్ పబ్లిక్ ఆఫరింగ్‌కు (IPO) పెట్టుబడిదార్ల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు, ఈ షేర్ల లిస్టింగ్ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. భారతి హెక్సాకామ్ ఐపీవో 30 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. సంస్థాగత పెట్టుబడిదార్ల నుంచి బలమైన స్పందన అందుకుంది, వాళ్ల కోటా 48.57 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ అయింది.
షేర్ల లిస్టింగ్ ఎప్పుడు?
భారతి హెక్సాకామ్, ఈ నెల 08వ తేదీనే షేర్ల కేటాయింపును పూర్తి చేసింది. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 12న, గురువారం నాడు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ & బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవుతాయి. IPOలో అలాట్‌మెంట్ దక్కని పెట్టుబడిదార్లకు ఈ రోజు (ఏప్రిల్ 10) డబ్బు వాపసు వస్తుంది. మీరు ఇప్పటికీ అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ చేసుకోకపోతే.. NSE, BSE వెబ్‌సైట్‌ల్లో అలాట్‌మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదా, కేఫిన్ టెక్నాలజీ లిమిటెడ్ (Kfin Technologies Ltd) వెబ్‌సైట్‌లోనూ కేటాయింపు స్థితిని తనిఖీ చేయవచ్చు.
అలాట్‌మెంట్ స్టేటస్‌ను BSE వెబ్‌సైట్‌లో ఇలా తనిఖీ చేయండి
1. https://www.bseindia.com/investors/appli_check.aspxపై క్లిక్ చేయండి.
2. అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోండి.
3. ఈక్విటీ ఆప్షన్ ఎంచుకోండి. డ్రాప్ డౌన్ మెనులో భారతి హెక్సాకామ్‌పై క్లిక్ చేయండి.
4. అప్లికేషన్ నంబర్, పాన్ నంబర్‌ను నమోదు చేయండి.
5. క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
6. ఈ కంపెనీ షేర్లు మీకు దక్కాయో, లేదో స్క్రీన్ మీద కనిపిస్తుంది.
అలాట్‌మెంట్ స్టేటస్‌ను NSE వెబ్‌సైట్‌లో ఇలా తనిఖీ చేయండి
1. https://www1.nseindia.com/products/dynaContent/equities/ipos/ipo_login.jspపై క్లిక్ చేయండి.
2. మీ PAN ఆప్షన్ ఎంచుకోండి. 'Click here to sign up' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. మీ పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
4. ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో IPO షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ తెలుస్తుంది.
రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌లో స్టేటస్‌ను ఇలా తనిఖీ చేయండి
1. Kfin Technologies వెబ్‌సైట్ https://www.kfintech.com/ పై క్లిక్ చేయండి.
2. హోమ్ పేజీలో కనిపించే IPO స్టేటస్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. సర్వర్‌ను ఎంచుకోండి.
4. డ్రాప్ డౌన్ మెను నుంచి భారతి హెక్సాకామ్ ఆప్షన్ ఎంచుకోండి.
5. మీ పాన్, డీమ్యాట్ ఖాతా లేదా అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
6. క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
7. అలాట్‌మెంట్ స్టేటస్ కొన్ని నిమిషాల్లోనే మీకు తెలుస్తుంది.
GMP పరిస్థితి ఏమిటి?
భారతి హెక్సాకామ్ IPO ఈ నెల 03న ప్రారంభమైన 05వ తేదీన ముగిసింది. ఈ మూడు రోజుల్లో దాదాపు రూ.4,275 కోట్లను కంపెనీ సేకరించింది. ఈ IPO పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో వచ్చింది, కొత్త షేర్లను కేటాయించలేదు. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా OFS ద్వారా 7.5 కోట్ల షేర్లను లేదా 15 శాతం వాటాలను విక్రయించింది. IPO కోసం ఒక్కో షేర్‌కు రూ.542 - రూ.570 ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ నిర్ణయించింది. కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ.85 ప్రీమియం పలుకుతున్నాయి. అంటే 14.91 శాతం లిస్టింగ్ గెయిన్స్ సంకేతాలు పంపుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
Andhra Group 2 : ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే