By: ABP Desam | Updated at : 12 Jan 2023 11:29 AM (IST)
Edited By: Arunmali
సాలిడ్‌గా లిస్ట్ అయిన సాహ్ పాలిమర్స్
Sah Polymers IPO Listing: స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సాహ్ పాలిమర్స్ షేర్లు ఇవాళ (గురువారం, 12 జనవరి 2023) దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేశాయి. బోర్సెస్‌లో చాలా స్ట్రాంగ్‌గా లిస్ట్ అయ్యాయి. ఈ కంపెనీ, ఒక్కో షేరును రూ. 65 చొప్పున IPOలో జారీ చేస్తే, 30 శాతం లాభంతో రూ. 85 వద్ద స్టాక్ లిస్ట్ అయ్యాయి.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ BSEలోను, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ NSEలోను రూ. 85 వద్ద, సాహ్ పాలిమర్స్ షేర్లు మార్కెట్‌లోకి అడుగు పెట్టాయి. లిస్టింగ్ తర్వాత, ఈ స్టాక్ మరింత వృద్ధిని చూస్తోంది. ఈ వార్త రాసే సమయానికి సాహ్ పాలిమర్స్ ఒక్కో షేర్ 37.33 శాతం లాభంతో 89.25 శాతం వద్ద ట్రేడవుతోంది.
విచిత్రం ఏంటంటే.. సాహ్ పాలిమర్స్ లిస్టింగ్ మీద ఇన్వెస్టర్లకు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కొన్ని రోజులుగా మార్కెట్ సెంటిమెంట్ బాగోలేకపోవడం, అనధికార మార్కెట్‌లో (grey market) ఈ షేర్లు పెద్దగా ప్రీమియాన్ని కమాండ్ చేయకపోవడం దీనికి కారణాలు. అందుకే, ఫ్లాట్ లిస్టింగ్ లేదా నామమాత్రపు లాభం ఉండొచ్చని మదుపర్లు భావించారు. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ, లిస్టింగ్ సమయానికి ఈ స్టాక్ అనూహ్యంగా రెచ్చిపోయింది.
ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ నేల చూపులు చూస్తున్నా, సాహ్ షేర్లు మాత్రం ఆకాశం వైపు చూస్తున్నాయి, పెట్టుబడిదార్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
The NSE Bell has rung in the celebration of the listing ceremony of Sah Polymers Limited on the Exchange today! #NSE #Listing #IPOListing #NSEIndia #StockMarket #ShareMarket #SahPolymersLimited @AshishChauhan pic.twitter.com/nX9oxoGEo2
— NSE India (@NSEIndia) January 12, 2023
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో స్టాక్ లిస్టింగ్ తర్వాత, ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 230 కోట్లకు చేరుకుంది.
సాహ్ పాలిమర్స్ IPO వివరాలు
సాహ్ పాలిమర్స్, రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.61-65 ప్రైస్ బ్యాండ్‌లో విడుదల చేసింది. IPO ద్వారా రూ. 66.3 కోట్లు సమీకరించింది. ఈ ఇష్యూ మొత్తం 17.46 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 39.78 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 32.69 రెట్లు, సంస్థాగత పెట్టుబడిదారుల కోటా 2.4 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
సాహ్ పాలిమర్స్ వ్యాపారం
1992లో ఈ కంపెనీని స్థాపించారు. పాలీప్రొఫైలిన్ సంచులు, అధిక సాంద్రత కలిగిన పాలిథిలిన్ బాక్స్ బ్యాగ్‌లను తయారు చేసి, ఎగుమతి చేస్తోంది. ఫ్లెక్సిబుల్ ఇంటర్మీడియట్ బల్క్ కంటైనర్లు (FIBC), బైయాక్సిలీ ఓరియెంటెడ్ పాలీప్రొఫైలిన్ (BOPP) లామినేటెడ్ బ్యాగ్‌లను కూడా తయారు చేసి, ఎగుమతి చేస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం