By: ABP Desam | Updated at : 03 May 2022 08:32 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎల్‌ఐసీ ఐపీవో
దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ (LIC)! ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఈ కంపెనీ ఐపీవో మే4, బుధవారం నుంచి మొదలవుతోంది. సాధారణ ఇన్వెస్టర్లు ఈ తేదీ నుంచి ఐపీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు.
LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
సబ్‌స్క్రిప్షన్ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రైస్ బ్యాండ్ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఆఫర్ వివరాలు: అప్పర్ బ్యాండ్ ధరకు ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు సమీకరించనుంది. ఇది మొత్తంగా ఆఫర్ ఫర్ సేల్ ఐపీవో. 221,374,920 ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం ఆఫర్లో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు రిజర్వు చేశారు.
ఎన్ని లాట్లు ఇస్తారు: ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు బిడ్ దాఖలు చేయొచ్చు. ఒక లాట్‌లో 15 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 14 లాట్లు అంటే 210 షేర్లకు బిడ్ వేయొచ్చు. మొత్తం రూ.1,99,290 అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎల్‌ఐసీ ఫ్రొఫైల్: గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP), న్యూ బిజినెస్ ప్రీమియం (NBP) ప్రకారం ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. వ్యక్తిగత పాలసీలు, గ్రూప్ పాలసీలు అత్యధికంగా విక్రయించిన కంపెనీ ఇదే. ఇతర కంపెనీలతో పోలిస్తే NBPలో 61.4 శాతం మార్కెట్ వాటా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న ప్రవేటు కంపెనీ వాటా 9.16 శాతమే కావడం గమనార్హం.
కంపెనీ ఫైనాన్షియల్స్: 2021 ఆర్థిక ఏడాది ముగింపు నాటికి ఎల్‌ఐసీ వద్ద రూ.37,46,404 కోట్ల ఆస్తులు (AUM) ఉన్నాయి. అంతకు ముందు ఏడాది రూ.34,14,174 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధి నమోదు చేసింది. నికర లాభం రూ.2710 కోట్ల నుంచి రూ.2,974 కోట్లకు పెరిగింది.
కొనే ముందు చూడాల్సింది: కొన్నేళ్లుగా ఎల్‌ఐసీ తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. ప్రైవేటు కంపెనీలు వేగంగా చొచ్చుకుపోతున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రకారం చూస్తే ఎల్‌ఐసీకి 64 శాతం మార్కెట్ షేర్ ఉంది. 2016-2021 మధ్య 9 శాతం సీఏజీఆర్ నమోదు చేసింది. అదే సమయంలో ప్రైవేటు కంపెనీలు 18 శాతం వృద్ధి నమోదు చేశాయి.
ఎల్‌ఐసీలో ఇప్పటికీ ప్రభుత్వానికే ఎక్కువ వాటా ఉంటుంది. భవిషత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే షేర్ హోల్డర్లపై ప్రభావం పడొచ్చు. ఎల్‌ఐసీకి డిజిటల్ ప్రజెన్స్ ఎక్కువగా లేదు. 90 శాతం పాలసీలు ఏజెంట్ల ద్వారానే విక్రయిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే కంపెనీకి ఖర్చులు మరింత పెరుగుతాయి.
ఈవారం IPOకు వస్తున్న 11 కంపెనీలు, నిధుల సమీకరణే లక్ష్యంగా పోటీ
Mega IPO: ఫస్ట్ లిస్టింగ్‌లో దూసుకెళ్లిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ షేర్ - కొనసాగుతుందా? ఇతర వాటిలా పడిపోతుందా?
Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!
Most Awaited IPO: ఈ IPO కోసం 9 ఏళ్లుగా ఎదురుచూపులు - అతి త్వరలో సెబీ అనుమతి!
Upcoming IPO: మార్కెట్‌లోకి రానున్న రూ.15000 కోట్ల IPO, డబ్బులతో రెడీగా ఉండండి
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్