search
×

IPO News: ఐపీవోకి రాకుండా భయపడుతున్న 5 కంపెనీలివి, మరొక్క నెలే వీటికి టైముంది

అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లన్నీ ఈ నెలలో కనీసం 5% ర్యాలీ చేస్తే, మన మార్కెట్లు ఒక రేంజ్‌ బౌండ్‌లోనే కొట్టుమిట్టాడుతున్నాయి.

FOLLOW US: 
Share:

IPO News: 2023 ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, మన మార్కెట్లు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌తో డీకప్లింగ్‌ (Decoupling) అయ్యాయి, విరుద్ధంగా పని చేస్తున్నాయి. 

2022లో అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాల స్టాక్‌ మార్కెట్లు పడిపోతున్న సమయంలో ఇండియన్‌ ఈక్విటీస్‌ ర్యాలీ చేశాయి. ఇప్పుడు, అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్లన్నీ ఈ నెలలో కనీసం 5% ర్యాలీ చేస్తే, మన మార్కెట్లు ఒక రేంజ్‌ బౌండ్‌లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. గ్లోబల్‌ క్యూస్‌ పాజిటివ్‌గా ఉన్నా పరుగు పెట్టలేకపోతున్నాయి. మన మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కు తీసుకుంటున్న పారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు), ఆ డబ్బును మిగిలిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు తరలిస్తున్నారు. మన మార్కెట్లలో క్షీణతకు, ఇతర మార్కెట్లలో ర్యాలీకి ప్రధాన కారణం ఇదే.

ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ప్రకటించడానికి కొన్ని కంపెనీలు వెనుకాడుతున్నాయి. మార్కెట్‌ సెంటిమెంట్‌ సరిగ్గా లేని ఈ పరిస్థితుల్లో తమ IPOను పెట్టుబడిదారులు తిరస్కరించవచ్చని, IPOకు ఒక మోస్తరు స్పందన కూడా రాకపోవచ్చని భయపడుతున్నాయి. స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) నుంచి ఆమోదం పొందినప్పటికీ, IPOను కోల్డ్ స్టోరేజీలో పెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

గత ఆరు నెలల్లో సెబీ నుంచి అనుమతి పొందినా.. మార్కెట్ మూడ్ సరిగా లేకపోవడంతో 27 కంపెనీలు ఐపీవోలకు రాలేదు. దీంతో, ఆయా కంపెనీలకు సెబీ ఇచ్చిన ఆమోదం ల్యాప్ అయింది. SEBI నుంచి అనుమతి పొందిన ఒక సంవత్సరం లోపు సదరు కంపెనీ IPOని ప్రారంభించవలసి ఉంటుంది. ఏ కారణం వల్లనైనా ఈ వ్యవధిలోపు IPOను తీసుకురాకపోతే, ఆ కంపెనీ మళ్లీ కొత్తగా సెబీకి దరఖాస్తు చేసుకోవాలి. కొత్త వివరాలతో అప్‌డేటెడ్‌ డ్రాఫ్ట్ పేపర్‌ సమర్పించాలి. సెబీ దానిని పరిశీలించి, ఓకే చెప్పడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది.

5 కంపెనీలకు ముంచుకొస్తున్న ముగింపు గడువు

ఇప్పుడు.. IPO ప్రారంభించడానికి సెబీ ఇచ్చిన అనుమతి గడువు మరో 5 కంపెనీలకు వచ్చే నెలలో (ఫిబ్రవరి, 2023) ముగియనుంది. 

ఫిబ్రవరిలో IPO గడువు ముగియనున్న కంపెనీలలో ప్రముఖమైన కంపెనీ API హోల్డింగ్స్ (API Holdings). IPO కోసం 17 ఫిబ్రవరి 2022న ఈ కంపెనీ SEBI నుంచి అనుమతి పొందింది. ప్రైమరీ మార్కెట్‌ నుంచి 6,250 కోట్ల రూపాయలను సమీకరించాలని API హోల్డింగ్స్ ప్లాన్ చేసింది. 

సీఎంఆర్‌ గ్రీన్ టెక్ (CMR Green Tech) కూడా 2022 ఫిబ్రవరి 16వ తేదీన SEBI ద్వారా ఆమోదం అందుకుంది. మార్కెట్ నుంచి రూ. 2,000 కోట్లు సమీకరించాలన్నది ఈ కంపెనీ ప్రణాళిక.

వెల్‌నెస్ ఫరెవర్ IPO (Wellness Forever IPO) కూడా 2022 ఫిబ్రవరి 16న SEBI అనుమతి దక్కించుకుంది. రూ. 1,500 కోట్లు సమీకరించాలన్నది ఈ కంపెనీ ఈ వెల్‌నెస్ కంపెనీ ప్రణాళిక. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ లోపు IPOని తీసుకురాకపోతే, డ్రాఫ్ట్ పేపర్‌ను మళ్లీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 

క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ IPOని (Capital Small Finance Bank IPO) 2022 ఫిబ్రవరి 8వ తేదీన సెబీ ఆమోదించింది. ఐపీఓ ద్వారా రూ. 1,000 కోట్లను సమీకరించాలని ఈ సంస్థ భావించింది. ఐపీవోకి వచ్చే గడువు ఈ కంపెనీకి కూడా వచ్చే నెలలో ముగియనుంది.

IPO ద్వారా రూ. 900 కోట్లను సేకరించేందుకు జాసన్స్ ఇండస్ట్రీస్ (Jesons Industries) సిద్ధమైంది, 2022 ఫిబ్రవరి 8వ తేదీన మార్కెట్‌ రెగ్యులేటర్‌ అనుమతి పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ లోపు IPOని తీసుకురాకపోతే, డ్రాఫ్ట్ పేపర్‌ను మళ్లీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. 

Published at : 17 Jan 2023 03:12 PM (IST) Tags: IPO News API Holdings CMR Green Tech IPO Capital Small Finance Bank IPO Wellness Forever IPO Jesons Industries IPO

ఇవి కూడా చూడండి

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌

Swiggy IPO: బచ్చన్‌ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ

Swiggy IPO: బచ్చన్‌ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ

Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్‌ బద్దలవుతుంది!

Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్‌ బద్దలవుతుంది!

Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే

Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే

IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!

IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!

టాప్ స్టోరీస్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!

Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!

Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు

Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు

Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy