భారత్  మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్..రూ.47,070 ఉంది.  దివాలీ దగ్గర పడుతుండడంతో బంగారం ధర ఆఫ్ సెంచరీ కొట్టేస్తుందని మార్కెట్ నిపుణుల అంచనా. భారత్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 63,600 కాగా ప్రధాన నగరాల్లో ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,300, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,330
విజయవాడలో  10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,300, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,330
విశాఖపట్టణంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,300, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,330
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 46,450, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,670
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,070, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,070
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.44,620, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,680
కోల్ కతాలో 10 గ్రాముల 22 క్యారెట్లో పసిడి ధర రూ.46,750, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 49,450
Also Read: మోస్ట్ పవర్‌ఫుల్ యాపిల్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలుసా?
వెండి ధరలు..
భారత్ మార్కెట్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రధాన నగరాల్లో నిన్నటి కన్నా ఈ రోజు ధరల్లో స్పల్ప వ్యత్యాసం ఉంది. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 63,600 ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో కేజీ వెండి  ధర రూ. 67,500 ఉండగా... ఢిల్లీ, ముంబై, కోల్ కతా , బెంగళూరు, లక్నోలో కేజీ వెండి ధర రూ. 63,600 ఉంది. చెన్నై ,కేరళలో కేజీ వెండి రూ. 67,500 ఉంది.
Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: కొత్త ఎయిర్‌పోడ్స్ వచ్చేశాయ్.. ఎయిర్‌పోడ్స్ ప్రో కంటే తక్కువ ధరకే!
Also Read: కేరళలో క్రేజీ వివాహం.. వానలు , వరదలను లెక్కచేయకుండా..
Also Read: ఇది లోబడ్జెట్ ‘స్క్విడ్ గేమ్’.. అదరగొట్టేసిన పిల్లలు.. కొరియన్ వెబ్‌సీరిస్ రికార్డుల మోత!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి