యాపిల్ తన అన్‌లీష్డ్ ఈవెంట్‌లో మూడో తరం ఎయిర్‌పోడ్స్‌ను లాంచ్ చేసింది. వీటిని ఎయిర్‌పోడ్స్(3rd Generation) అని కూడా పిలవచ్చు. 2019 మార్చిలో లాంచ్ అయిన ఎంట్రీ లెవల్ ఎయిర్ పోడ్స్ 2కు తర్వాతి వెర్షన్‌గా ఈ కొత్త ఎయిర్‌పోడ్స్ లాంచ్ అయ్యాయి. వీటితో పాటు వైర్‌లెస్ చార్జింగ్ కేస్‌ను కూడా అందించనున్నారు.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ (థర్డ్ జనరేషన్) ధర
వీటి ధరను మనదేశంలో రూ.18,500గా నిర్ణయించారు. ఈ ఎయిర్ పోడ్స్ సేల్ మనదేశంలో అక్టోబర్ 26వ తేదీ నుంచి జరగనుంది. ఒకేసారి 26 దేశాల్లో వీటికి సంబంధించిన సేల్ జరగనుంది.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ (థర్డ్ జనరేషన్) స్పెసిఫికేషన్లు
వీటి డిజైన్ ఎయిర్‌పోడ్స్ ప్రో తరహాలో ఉండనుంది. ప్రెజర్ కంట్రోల్ కోసం ఫోర్స్ సెన్సార కూడా ఇందులో ఉంది. గత వెర్షన్ తరహాలోనే హే సిరి వాయిస్ అసిస్టెంట్ ఇందులో కూడా ఉంది. యాపిల్ మ్యూజిక్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇది చేయనుంది. ఎక్కువ డైనమిక్ రేంజ్ యాంప్లిఫయర్ ఉన్న కస్టమ్ డ్రైవర్‌ను ఇందులో అందించారు.
ఫఏస్ టైం కాల్స్ సమయంలో ఫుల్ హెచ్‌డీ వాయిస్ క్వాలిటీని అందించడానికి ఏఏసీ-ఈఎల్‌డీ కోడెక్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అడాప్టివ్ ఈక్యూ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఎయిర్ పోడ్స్ మీ చెవిలో ఫిట్ అయిన విధానాన్ని బట్టి సౌండ్ ట్యూన్ అవుతుంది. దీంతోపాటు గత ఎయిర్ పోడ్స్ ప్రో, ఎయిర్ పోడ్స్ మ్యాక్స్ తరహాలో ఇందులో కూడా డైనమిక్ హెడ్ ట్రాకింగ్ కూడా అందించారు.
వీటిలో స్కిన్ డిటెక్ట్ సెన్సార్ కూడా ఉంది. మీ ఇయర్ బడ్స్ చెవిలో ఉన్నాయా, జేబులో ఉన్నాయా, టేబుల్ మీద ఉన్నాయా అనేవి గుర్తించి, మీ చెవిలో నుంచి తీయగానే ప్లేబ్యాక్‌ను ఆపేస్తాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఆరు గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా వీడియో ప్లేబ్యాక్ టైం, నాలుగు గంటల వరకు టాక్‌టైంను అందించనున్నాయి. కేస్‌లో కలిపితే మొత్తంగా 30 గంటల వరకు ప్లేబ్యాక్ టైం లభించనుంది.
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!